Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగర్కర్నూల్ జడ్పీ చైర్మెన్ ఠాగూర్ బాలాజీ సింగ్
హైదరాబాద్ : రాజపుత్రులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని నాగర్ కర్నూల్ జడ్పీ చైర్మెన్ ఠాగూర్ బాలాజీ సింగ్ అన్నారు. ఈ మేరకు సోమవారం గోల్నాక డివిజన్ పరిధిలోని మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఉన్న రాజపుత్రులను అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. అలాగే బొందిలీ రాజపుత్ర సమాజానికి ఉప్పల్ బాగాయత్లో ఒక ఎకరా స్థలం, రూ.కోటి ఇచ్చినందుకు కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సుఖ్ రాజ్ సింగ్, ప్రేమ సింగ్ , రమేశ్వేర్ సింగ్, రంజిత్ సింగ్, రవీంద్రనాథ్ సింగ్ , కుందన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.