Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 23న సిద్దిపేటలో భారీ బహిరంగసభ
- హాజరు కానున్న కేరళ కార్మిక శాఖ మంత్రి వి.శివన్కుట్టి
- పోస్టరావిష్కరణలో వెల్లడించిన సీఐటీయూ నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఐటీయూ రాష్ట్ర నాలుగో మహాసభలు ఈ నెల 21,22,23 తేదీల్లో సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరుగబోతున్నాయని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ప్రకటించారు. 23న సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ముఖ్య అతిథులుగా కేరళ కార్మిక శాఖ మంత్రి వి.శివన్కుట్టి, సీఐటీయూ జాతీయ అధ్యక్షులు కె.హేమలత, తదితర నేతలు పాల్గొంటారనీ, ఆ సభను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర మహాసభల కు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, రాష్ట్ర కార్యదర్శులు ఎస్వీ. రమ, భూపాల్, రాష్ట్ర కమిటీ సభ్యులు కూరపాటి రమేష్, పుప్పాల శ్రీకాంత్, యాటల సోమన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ యూని యన్ మహాసభలను సిద్దిపేటలో మల్లుస్వరాజ్యం నగర్లో 600 మంది ప్రతినిధులతో నిర్వహించను న్నామని తెలిపారు. రాష్ట్రంలోని కార్మి కుల స్థితి గతులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, మూడేం డ్ల కాలంలో సీఐటీయూ నిర్వహించిన పోరా టాలు, సమ్మెలను సమీక్షించి భవిష్యత్ ఉద్యమాలకు రూపకల్పన చేస్తామన్నారు. షెడ్యూల్ పరిశ్రమల జీవోల జారీ, ఇప్పటికే విడుదల చేసిన జీవోలను గెజిట్ చేయడం, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించడం, అసంఘత రంగంలోని బీడీ, భవన నిర్మాణం, హమాలీ, ప్రయివేటు, ట్రాన్స్‌పోర్టు కార్మి కులకు సమగ్ర శాసనం, పబ్లిక్ సెక్టార్లో పని చేసేవారికి పని భద్రత, మౌలిక వసతులు తదితర కార్మికుల సమస్యలపై చర్చిస్తామని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లు, విద్యుత్ సవరణ బిల్లు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలు తీర్మానాలు చేసి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. మొదటి రోజు మహాసభలను సీఐటీయూ జాతీయ అధ్యక్షులు కె.హేమలత, జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ప్రారంభిస్తారని తెలిపారు. అఖిల భారత కేంద్రం నుంచి మహాసభల పరిశీల కు లుగా జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు హాజ రవుతారని చెప్పారు. మహాసభల చివరిరోజైన 23న జరిగే బహిరంగ సభకు పారిశ్రామిక, కార్మిక వాడల నుంచీ, ప్రతి గ్రామం నుంచీ ఉద్యోగులు, కా ర్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.