Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు
- ఐఎస్బీ, వీసీల సమావేశంలో ఉన్నత విద్యామండలి నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డిగ్రీ పరీక్షా విధానంలో సమూల మార్పు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. కొన్ని ప్రశ్నల నే చదువుకుని పరీక్షల్లో జవాబులు రాసే విధానానికి చెక్ పడనుంది. విద్యార్థులను సమగ్రంగా అధ్యయనం చేయనుంది.
ఇందుకు సంబంధించి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తో ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ గతంలోనే అవగా హన ఒప్పందాన్ని కుదుర్చుకున్న విష యం తెలిసిందే. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం కొన సాగుతున్న పరీక్షా విధానాన్ని ఐఎస్బీ ప్రతినిధులు పరిశీలించారు. వివిధ దేశాలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర వర్సిటీల్లో అమలవుతున్న విధానాన్ని అధ్యయనం చేశారు. రాష్ట్రా నికి అవసరమైన మార్పులకు సంబం ధించి నివేదికను రూపొందించి ఉన్నత విద్యామండలికి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఇవ్వాలని నిర్ణయించారు. సంప్రదాయ డిగ్రీ కోర్సులున్న ఆరు విశ్వవిద్యాలయాల వీసీలతో కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మెన్ వి వెంకట రమణ, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, ఐఎస్బీ ప్రొఫెసర్ చంద్రశేఖర్ శ్రీ పాద, ఓయూ వీసీ డి రవీందర్, కేయూ వీసీ టి రమేష్, ఎంజీయూ వీసీ సిహెచ్ గోపాల్‌రెడ్డి, టీయూ వీసీ డి రవీందర్‌గుప్తా, ఎస్‌యూ వీసీ ఎస్ మల్లేశం, పీయూ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వీసీ కె సీతారామారావు సమావేశమయ్యారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త పరీక్షా విధానం అమల్లోకి తేవాలని ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు. బట్టీ పట్టి చదువు కునేలా కాకుండా ఉపాధి దొరికేలా పరీక్షా విధానాన్ని మార్చబోతున్నారు. మూల్యాంకనంలోనూ మార్పులు తీసు కొచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అను గుణంగా సిలబస్‌నూ మార్చాలన్న అభిప్రాయంతో ఉన్నారు. ఇంగ్లీష్, తెలుగు సబ్జెక్టులపై పట్టు పెంచు కునేలా వాటికి ప్రాక్టికల్ మార్కులు, ల్యాబ్‌లను ఏర్పాటు చేసే అవకాశ మున్నది. వీటిపై అధ్యాపకులు, విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు.