Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పరిషత్ ముట్టడి.. పోలీసులు, రైతుల తోపులాట
- జడ్పీలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నం.. స్వల్ప ఉద్రిక్తత
- జిల్లా పరిషత్ ముట్టడి.. పోలీసులు, రైతుల తోపులాట
- జడ్పీలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నం.. స్వల్ప ఉద్రిక్తత
- అలైన్మెంట్ మార్చాల్సిందే అని పట్టుబట్టిన రైతులు
- మద్దతుగా నిలిచిన సీపీఐ(ఎం), సీపీఐ, ప్రజాపంథా
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నాగపూర్- అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్వాసితులు మరో మారు రోడ్డెక్కారు. అలైన్మెంట్ మార్చాల్సిందేనని ఏండ్లుగా ఆందోళ నలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజులుగా మరింత ఉధృతంగా నిరసనలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా సోమవారం తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భూ నిర్వాసితులు కలెక్టరేట్ ముట్టడించారు. గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ వీపీ గౌతమ్ జిల్లా పరిషత్‌లో ఉండటంతో జడ్పీకి వెళ్లేందుకు నిర్వాసిత రైతులు ప్రయత్నించారు. ఖమ్మం ఆర్డీవో కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి వైరారోడ్డు మీదుగా జడ్పీకి చేరుకున్నారు. జడ్పీలోకి వెళ్తున్న నిర్వాసితులను పోలీసులు అడ్డుకోవడంతో రైతులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. నిర్వాసితులకు అఖిలపక్షాల రైతుసంఘాలు మద్దతుగా నిలి చాయి. అలైన్మెంట్ మార్చాల్సిందేనంటూ రైతులు పెద్దపెట్టున నినదిం చారు. అఖిలపక్షాల నేతలు, రైతులు ఇదే డిమాండ్‌తో ఆందోళన చేపట్టారు.
కోదాడ- కొరవి రోడ్డుకు అనుసంధానించాలి: అఖిలపక్షాల నేతలు
గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్వాసితుల ఆందోళనకు సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా నేతలు మద్దతు తెలిపారు. ఆందోళనలో భాగంగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సంగబత్తుల నవీన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర రైతుసంఘం అధ్యక్షులు బాగం హేమంతరావు, సీపీఐ(ఎం), ప్రజాపంథా జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, గోకినేపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఖమ్మం నగర అభివృద్ధికి ఆటంకంగా మారిన అలైన్మెంట్తో గ్రీన్‌ఫీల్డ్ హైవేను నిర్మించేందుకు యత్నిస్తోందన్నారు. విలువైన పంటభూములు, ఇండ్లస్థలాల మీదుగా రోడ్డు నిర్మిస్తే రైతులు, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. కోదాడ- కొరవి రోడ్డుతో దీన్ని అనుసంధానించి అమరావతి- హైదరాబాద్ హైవేతో కలపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్వహించిన పర్యావరణం అభిప్రాయ సేకరణలోనూ నిర్వాసితులు ముక్తకంఠంతో వ్యతిరేకించినా.. ఇవేవీ పట్టించుకోకుండా పర్యావరణానికి వ్యతిరేక అభిప్రాయం ఎక్కడ వ్యక్తం కాలేదని అధికారులు నివేదించడం సరికాదన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు దీనిపై స్పందించి అలైన్మెంట్ మార్పునకు కృషి చేయాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్‌కు వినతిపత్రం సమర్పించారు. సీఐలు రామకృష్ణ, సర్వయ్య బందోబస్తు నిర్వహించారు. ఖమ్మం రూరల్, రఘునాథపాలెం, చింతకాని, ఎర్రుపాలెం, ఖమ్మం అర్బన్ తదితర మండలాల నుంచి నిర్వాసిత రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆందోళనకు మద్దతు తెలిపిన వారిలో ఆయా రైతుసంఘాల నాయకులు పోటు ప్రసాద్, మాదినేని రమేష్, కొండపర్తి గోవిందరావు, ఆవుల వెంకటేశ్వర్లు, ప్రజాసంఘాల నాయకులు ఆవుల అశోక్, దొండపాటి రమేష్, యర్రా శ్రీనివాస్, సలాం, మీరాసాహెబ్, గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్వాసిత జేఏసీ నాయకులు తక్కెళ్లపాటి భద్రయ్య, వేములపల్లి సుధీర్, ప్రతాపనేని వెంకటేశ్వర్లు, మందనపు రవీంద్ర, నాగండ్ల శ్రీధర్, వేముల సతీష్, వజ్జా రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.