Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పునరుత్పాదక శక్తితో నిర్వహణ
- 470 మందికి ఉపాధి
నవ తెలంగాణ- హైదరాబాద్
దేశంలోనే అతిపెద్ద సమీకృత సరుకు రవాణ సంస్థల్లో ఒక్కటైన మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్ (ఎంఎల్ఎల్) హైదరాబాద్ సమీపంలో భారీ మల్టీ క్లయింట్ లాజిస్టిక్ గిడ్డంగిని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. సంగారెడ్డి జిల్లాలోని మైలవరంలో 17 ఎకరాల్లోని స్థలంలో ఏకంగా 10 ఎకరాల్లో (7.5 లక్షల చదరపు అడుగుల్లో) దీన్ని నిర్మించామని మహీంద్రా లాజిస్టిక్స్ ఎండి, సిఇఒ రామ్ ప్రవీణ్ స్వామినాథన్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ యూనిట్ కోసం రూ.35-40 కోట్ల పెట్టుబడి పెట్టామన్నారు. ఈ గిడ్డంగి ద్వారా 470 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. థర్డ్ పార్టీ అసోసియేట్లు అదనంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయన్నారు. పండగ సీజన్లో ఏకంగా 1200 మందికి ఉపాధి అవకాశాలు ఉంటున్నాయన్నారు. పలు దిగ్గజ ఈ కామర్స్ వేదికలు తమ ఉత్పత్తులను ఇక్కడ నిల్వ చేసుకుంటున్నాయన్నారు. దేశ వ్యాప్తంగా 250, తెలంగాణ రాష్ట్రంలో తమ సంస్థకు 14 గిడ్డంగి కేంద్రాలున్నాయన్నారు.