Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ కేసు విచారణ నేటికి వాయిదా
నవతెలంగాణ -హైదరాబాద్
ఎమ్మెల్యేల ఎర కేసులో బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్, కేరళ డాక్టర్ జగ్గుస్వామి, న్యాయవాది బి.శ్రీనివాస్‌కు సిట్ జారీ చేసిన నోటీసులపై స్టే ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించింది. వాళ్లను నిందితులుగా ప్రతిపాదిస్తూ సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టేసింది. దీనిపై సిట్ హైకోర్టు సవాల్ చేసింది. దీనిపై మరో జడ్జి ఈ నెల 21న తీర్పు వెలువరించనున్నారు. దీంతో సిట్ ఇచ్చిన 41ఎ నోటీసులపై గతంలోని స్టే ఉత్తర్వులను 22 వరకు పొడిగిస్తున్నట్టు జస్టిస్ కె.సురేందర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ 41ఎ నోటీసులతో పాటు లుక్ఔట్ నోటీసులపై కూడా స్టేను 22 వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా సిట్ దర్యాప్తు ఏకపక్షంగా జరుగుతున్నందున సీబీఐకి బదిలీ ఉత్తర్వులు జారీ చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన మరో రిట్‌ను జస్టిస్ విజరుసేన్‌రెడ్డి విచారణ జరిపారు.