Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కలిసి పార్లమెంటు సాక్షిగా గిరిజనులను మోసం చేశాయని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. రిజర్వేషన్ల విషయంలో మోడీ సర్కార్ మాటలు చెప్పి తప్పించుకుంటోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని టీఆర్ఎస్ శాసనస భాపక్ష కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడు తూ... గిరిజన రిజర్వేషన్ల పెంపుపై 2015లో చెల్లప్ప కమిషన్ నివేదికను ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ నివేదిక ఆధారంగా 2016లో రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని తెలిపారు. తదనుగుణంగా ఇటీవలే రిజర్వేషన్ల పెంపుపై తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు.