Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ కొత్త చరిత్రను సృష్టిస్తుంది...
- మీడియాతో ఇష్టాగోష్టిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్తో కేంద్రంలోని బీజేపీకి బ్రెయిన్ డ్యామేజీ అయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. తమ పార్టీ కచ్చితంగా దేశంలో కొత్త చరిత్రను సృష్టిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో కవిత... మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు ఉంటాయని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు మహిళలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. బతుకమ్మను కూడా ఆయన అవమానించటం శోచనీయమని అన్నారు. సరైన సమయంలో ప్రజలే ఆ పార్టీకి, సంజరుకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దర్యాప్తు సంస్థల విచారణకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడబోనని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. బీజేపీ రణనీతిలో ఆయా సంస్థలు భాగమని తెలిపారు. ప్రస్తుతమున్న తెలంగాణ జాగృతి యధావిధిగా కొనసాగుతుందనీ, రాబోయే రోజుల్లో భారత జాగృతి ద్వారా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి తానిప్పుడే ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని అన్నారు. వాటి గురించి ఆలోచించేందుకు ఇంకా చాలా సమయముందని వివరిం చారు. రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే బరిలోకి దిగుతానని చెప్పారు. ఇదే సమయంలో ఎంపీ అర్వింద్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడించి తీరతామని స్పష్టం చేశారు.