Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేవంత్, మహేష్ కుమార్ గౌడ్ హాజరు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
క్రిస్మస్ వేడుకలు గాంధీభవన్‌లో ఘనం గా జరిగాయి. టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మెన్ ప్రీతం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు పార్టీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్‌కట్ చేసి క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ జనరంజక పాలన అందించిన గొప్ప నాయకులను కాంగ్రెస్ అందించిందన్నారు. దళితులకు ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా కాంగ్రెస్ అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. ఏఐసీసీ అధ్యక్షులుగా మల్లిఖార్జునఖర్గేను ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళిత క్రిస్టియన్లకు కచ్చితంగా రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ మండలంలో ఒక క్రిస్టియన్ స్మశానవాటిక ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల కోసమే రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ వేడుకల్లో ఏఐసీసీ కార్యదర్శి జి చిన్నారెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, ఖైరతాబాద్ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, హైదరాబాద్ అధ్యక్షులు సమీరుల్లా, సీనియర్ నేతలు వినోద్‌రెడ్డి, చెరుకు సుధాకర్, శివసేనారెడ్డి, సునీతరావు, జగన్‌లాల్, శ్రవణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.