Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిటి అయోగ్ వైస్ చైర్మెన్ సుమన్‌తో సోమేష్‌కుమార్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కరీంనగర్ జిల్లాను ప్రధానంగా తీసుకుని రాష్ట్ర ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ వివరించారు. 2014లో జీఎస్డీపీ రూ. 5.5 లక్షల కోట్ల నుంచి గతేడాది రూ. 11.58 కోట్లకు పెరిగినట్టు వివరించారు. ప్రభుత్వ రంగంలో కొత్త ఉద్యోగాల కల్పన, ప్రతీ సంవత్సరం అన్ని రంగాల్లో సాధిస్తున్న గణనీయమైన ఆర్థిక వద్ధి, అధిక జీఎస్డీపీ పురోభివృద్ధి సాధించడం తదితర లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్దారించిందని పేర్కొన్నారు. ఆర్థికాభివద్ధికి చోదకంగా జిల్లాలను రూపొందించే అంశంపై నిటి ఆయోగ్ వైస్ చైర్మెన్ సుమన్ బేరీ...మంగళవారం న్యూఢిల్లీ కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ డాక్టర్ రాజీవ్ గౌబా తోపాటు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా సోమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలు సాధారణంగా తమ శాఖల బడ్జెట్లు, లక్ష్యాలు మొదలైన వాటిపై దృష్టి సారిస్తూ సాంప్రదాయ విధానంలో పని చేస్తాయన్నారు. ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా ప్రతి శాఖ ఏవిధమైన చర్యలు చేపట్టాలో తగు విధానాలు సిద్ధం చేయాలని వివిధ శాఖలను కోరినట్టు తెలిపారు. తద్వారా సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఈ విషయంలో అన్ని లైన్ డిపార్ట్మెంట్లతో మేధోమథన సమావేశాలు నిర్వహించామనీ, వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధించేందుకు దోహదపడే ఉద్యోగాల కల్పన, సంస్థాగతంపై కొత్తగా దృష్టి పెట్టామని తెలిపారు.