Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఐసీసీ అకాడమీ కోచ్ ఎడ్యుకేషన్ కోర్సులో లెవల్ వన్ సర్టిఫికెట్ సాధించిన బుర్రా లాస్యను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. శనివారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో కలిసిన ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక విజన్‌తో రాష్ట్రంలో క్రీడల అభివద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను తయారు చేయడం కోసం సుమారు 8500 గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామని వివరించారు. తెలంగాణ రాష్ట్రం గర్వించే విధంగా మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.