Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు లక్షల క్రైస్తవ కుటుంబాలకు దుస్తుల పంపిణీ
- చర్చిలలో విందులకు ఏర్పాట్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నదని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రిస్మస్ వేడుకలను అధికారికంగా నిర్వహహించడంతో పాటు ప్రతీ ఏడాది రాష్ట్రంలోని నిరుపేద క్రైస్తవ కుటుంబాలకు మూడు లక్షల మందికి దుస్తులను పంపిణీ చేస్తున్నది. రాష్ట్రంలోని అన్ని చర్చిలలో క్రిస్మస్ విందులను ప్రభుత్వమే అధికారికంగా ఏర్పాటు చేసి, లౌకిక స్ఫూర్తిని చాటుకుంటున్నది. రాష్ట్రంలో ఘనంగా అన్ని పండుగలను ప్రభుత్వమే చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఏ పండుగనూ ప్రభుత్వాలు పట్టించుకోలేదు.రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల 35 వేల మంది క్రైస్తవులకు క్రిస్మస్ బట్టలను కానుకగా ప్రభుత్వం అందజేస్తున్నది. ఇందులో 2.80 లక్షల మంది పురుషులకు ప్యాంటు షర్టులు, 2 లక్షల 77 వేల 500 మంది మహిళలకు చీరెలు, 2 లక్షల 77 వేల 500 మంది బాలికలకు డ్రెస్ మెటీరియల్ ప్రభుత్వం ఇచ్చింది. ఉప్పల్ భగాయత్‌లో క్రిస్టియన్ భవన్‌ను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నది. చర్చీలు, గ్రేవ్ యార్డ్ల అభివృద్ధికి అత్యధిక నిధులను ప్రభుత్వం ఇచ్చింది. తెలంగాణ ఏర్పాటయ్యాక చర్చిల నిర్మాణ అనుమతులను ప్రభుత్వం సులభతరం చేసింది. స్థానిక సంస్థల అనుమతితోనే చర్చిలను నిర్మించుకునే వీలును కల్పించింది. దీంతో కొత్తగా ఎన్నో చర్చిలు నిర్మితమయ్యాయి. మరికొన్ని చర్చిలకు మరమ్మతులు చేసి, ప్రహారీ గోడలు నిర్మించారు. గత ఎనిమిదేండ్లలో 411 చర్చి లకు రూ.32.63 కోట్లను మంజూరు చేసింది.
క్రిస్టియన్ మైనార్టీలకోసం
యువతకు అండగా నిలిచేలా ప్రభుత్వం డ్రైవర్ ఎంపవర్ మెంట్ పథకాన్ని ప్రారంభించింది. క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ పథకం అమలవుతున్నది.
ఈ పథకం కింద నిరుద్యోగ క్రిస్టియన్లకు 60 శాతం సబ్సిడీతో కార్లను అందజేస్తున్నది. కార్లను ట్రావెల్స్‌గా, క్యాబ్ మాదిరిగా నడుపుకొంటున్నారు. 154 మందికి రూ. 6.90 కోట్లను సబ్సిడీ గా అందజేసింది. 10 లక్షల వరకు సబ్సిడీ అందేలా బ్యాంకు లింకేజీతో రుణాలు ఇస్తున్నది. ఇప్పటి వరకు 1,748 మందికి రూ.19 కోట్లు సబ్సిడీగా అందించింది. క్రిస్టియన్ మైనార్టీలకు ఉపాధి శిక్షణ కల్పిస్తున్నది. లా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నది. వారికి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నది. క్రైస్తవ యువతకు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. మైనారిటీ విద్యార్థులకు విదేశీ (ఓవర్సీస్) స్కాలర్ షిప్పులు అందజేస్తున్నది. మైనారిటీ పారిశ్రామికవేత్తల కోసం టీఎస్ ప్రైమ్ నెలకొల్పింది. ఐటీ పారిశ్రామిక వేత్తల కోసం ఐటీ పార్కుల్లో అవకాశాలున్నాయి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులకు నిధులను కూడా ఇస్తున్నది.