Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కరోనా బీఎఫ్.7 వేరియంట్ విదేశాల్లో విజృంభిస్తున్న వేళ.. భారత్‌లో ఆ పరిస్థితి తలెత్తకపోవచ్చునని సీసీఎంబీ డైరెక్టర్ తెలిపారు. భారత్‌లో ఇప్పటికే ప్రజలకు కరోనా 'సామూహిక రోగనిరోధకత' వచ్చేసిందని 'సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయోలజీ డైరెక్టర్ వినయ్ కె నందికూరి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైనాలో బీఎఫ్.7 వేరియంట్‌కు ఉన్న తీవ్రత భారత్‌లో ఉండకపోవచ్చునని పేర్కొన్నారు. అలాగే డెల్టా వేరియంట్ అంత ప్రమాదకరం కూడా కాదని తెలిపారు.ప్రజలు మాత్రం కోవిడ్ వ్యాప్తి అరికట్టేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని వినరు నందికూరి సూచించారు. కొత్తగా వచ్చే అన్ని వేరియంట్లకు రోగనిరోధకతను తప్పించుకునే గుణం ఉండొచ్చని హెచ్చరించారు. టీకా తీసుకున్నా.. గతంలో ఇతర వేరియంట్ల బారిన పడినవారికి కూడా మళ్లీ కరోనా సోకే ముప్పు లేకపోలేదన్నారు. ''మనం ఇప్పటికే అతిపెద్ద డెల్టా వేవ్‌ను చూశాం. పైగా వ్యాక్సిన్లు తీసుకున్నాం. ఆ తర్వాత ఒమిక్రాన్ వచ్చింది. వెంటనే బూస్టర్ డోసులు వేసుకున్నాం. ఇలా ఏ రకంగా చూసినా మనం చైనా వారితో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉన్నాం. అందుకే అక్కడి పరిస్థితులు ఇక్కడ తలెత్తకపోవచ్చు'' అని వివరించారు.చైనా అనుసరించిన జీరో కోవిడ్ విధానమే ప్రస్తుతం అక్కడ వైరస్ విజంభించడానికి కారణమని వినరు అన్నారు. పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగకపోవడం కూడా తీవ్రతను మరింత పెంచి ఉంటుందన్నారు. భారత్‌లో మాత్రం వద్ధులకు సైతం బూస్టర్ డోసులు పంపిణీ చేసినట్లు గుర్తుచేశారు. అయితే, భారత్‌లో మరో వేవ్ వస్తుందా? లేదా? అని ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమన్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మాత్రం తక్షణమే వేవ్ వస్తుందని చెప్పేంత ముప్పు మాత్రం కనిపించడం లేదన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్స, వ్యాక్సినేషన్ అందరికీ అందుబాటులో ఉన్నాయన్నారు.