Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ప్రధాని మన్మోహన్ మీడియా సలహాదారు సంజయ బారు
- ఎప్పుడు ఏం అందించాలో తెలిసిన విజనరీ పీవీ: మాజీ ఐపీఎస్ లక్ష్మీ నారాయణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
మానవీయ సంస్కరణలను ప్రవేశపెట్టిన మహనీయుడు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు అని సీనియర్ జర్నలిస్ట్, మాజీ ప్రధాని మన్మో హన్‌సింగ్ మీడియా సలహాదారు సంజయ బారు అన్నారు. 2015 నుంచి ఐదు నుంచి ఆరు శాతం మధ్యే ఆర్థికవృద్ధి రేటు నడుస్తున్నదనీ, సమీపకాలంలో కోలుకునే అవకాశమూ కనిపించడం లేదని అభిప్రాయ పడ్డారు. ఆర్థిక సంస్కరణల్లోనూ మిడిల్ పాత్ విధానం ద్వారా భవిష్యత్ లక్ష్యాలకు బాటలు వేశారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో పీవీ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ''బిట్వీన్ ఇందిరా గాంధీ అండ్ నరేంద్ర మోడీ... ది ట్రాన్స్ఫర్మేటివ్ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరసింహారావు'' అనే అంశంపై సంజయబారు స్మారక ఉపన్యాసం చేశారు. విదేశాంగ విధానాల్లోనూ పీవీ తనదైన ముద్ర వేశారని చెప్పారు. పీవీ తర్వాత ప్రధానులుగా బాధ్యతలు చేపట్టిన వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ కూడా పీవీ విధానాల్ని అనుసరించారని వివరించారు. 1994లో కాశ్మీర్‌పై జెనీవాలో జరిగిన యూఎన్ మానవ హక్కుల సమావే శానికి భారదేశ అధికార ప్రతినిధిగా ప్రతిపక్ష నేత వాజ్‌పేయిని పంపించిన రాజనీతిజ్ఞుడు పీవీ అని సం జయ బారు కొనియాడారు. దేశానికి ఎంతో గొప్ప సేవ చేసిన పీవీకి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ భార తరత్న ఇవ్వకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
గురుకుల పాఠశాలలు గొప్ప వనరులు:లక్ష్మినారాయణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన గురుకుల, ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన నవోదయ విద్యాలయాలు దేశానికి గొప్ప మానవ వనరుల్ని అందించాయని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. పీవీ ప్రారంభించిన కొడిహనహళ్లి గురుకుల పాఠశాలలో చదువుకున్న విద్యార్థిగా ఆయన గురించి మాట్లాడే అవకాశం లభించడం తన అదృష్టమని అన్నారు. పీవీ రోరింగ్ లయన్, కంప్లీట్ మ్యాన్ అని చెప్పారు.
పీవీ నిరంతర అధ్యయనశీలి: పీవీ ప్రభాకర్ రావు
పంజాబ్, అసోం, కాశ్మీర్, కావేరీ వివాదాల పరిష్కారం పీవీ కృషి ఫలితమేనని పీవీ తనయుడు, పీవీ గ్లోబల్ ఫౌండేషన్ ఛైర్మన్ పీవీ ప్రభాకర్ రావు అన్నారు. పీవీ నరసింహారావు వివిధ రంగాల్లో చేసి న కృషిపై ప్రభాకర్ రావు రాసిన వ్యాస సంకలనం ''మబ్బుల చాటున సూరీడు'' పుస్త కాన్ని సంజయ బాయ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ జర్న లిస్టులు కె.రామ చంద్ర మూర్తి, మాశర్మ, జెన్కో సీఎం డీ దేవులపల్లి ప్రభా కర్రావు, ప్రొఫెసర్ కిషన్‌రావు, పీవీ కుటుంబ సభ్యులు,అభిమానులు, ఆత్మీయులు పాల్గొన్నారు.