Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు వరంగల్ అభ్యర్థి ప్రకటన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు ఖరారైనట్టే. అధిష్టానం ఆమోదం కోసం టిపిసిసి అధ్యక్షులు ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. అధిష్టానంతో చర్చించాక ఆ పేరును ప్రకటించే అవకాశం ఉంది. వరంగల్ ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు ఐదారు మంది నాయకులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఐదుగురి పేర్లతో జాబితాను ఫైనల్ చేసింది. ఈ జాబితాలో మాజీ ఎంపిలు సిరిసిల్ల రాజయ్య, గడ్డం వివేక్, సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రి విజయరామారావు, జిల్లా కాంగ్రెస్ నేత ప్రతాప్ ఉన్నట్టు తెలిసింది. జాబితాలోని పేర్లను పరిశీలించాక అందులో నుంచి ఒకరి పేరును అధిష్టానం సూచించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వరంగల్ ఉప ఎన్నికల బరిలో దిగే కాంగ్రెస్ అభ్యర్థి పేరును బుధవారం రోజు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.