Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జి షాపింగ్ మాల్ ప్రారంభం
- తరలివచ్చిన అభిమానులు
నవతెలంగాణ - సూర్యాపేట టౌన్
నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జి షాపింగ్ మాల్‌ను ఆదివారం సినీనటి హంసనందిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్‌లోని అతిపెద్ద షాపింగ్మాల్లను తలపించేలా జి షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పెండ్లి వస్త్రాల కొనుగోలుకు మహానగరాలకు వెళ్లకుండానే అన్ని రకాల వస్త్రాలూ ఈ షోరూంలో లభించడం ఆనందదాయకం అన్నారు. ప్రారంభోత్సవానికి వచ్చిన అభిమానులతో ఆమెతో సెల్ఫీలు దిగారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం షాపులోని వివిధ విభాగాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జి షాపింగ్ మాల్ నిర్వాహకులు గండూరి కృపాకర్, గండూరి సుధీర్, మున్సిపల్ చైర్పర్సన్లు గండూరి ప్రవళిక, వంటిపులి అనిత తదితరులు పాల్గొన్నారు.