Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి పనికీ ఓ అర్ధం..పూర్తిచేసే ధైర్యం కేసీఆర్‌ది : బతుకమ్మ చీరల పంపిణీలో ఎంపీ కవిత
నవతెలంగాణ- నిజామాబాద్
ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఆడబిడ్డలకు చీరలను కానుకగా ఇచ్చిన మీ అన్న సీఎం కేసీఆర్‌ను దీవించండి అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మహిళలను కోరారు. ఏ పని చేసినా దానికి అర్థం ఉండేలా.. ఆ పనిని పూర్తి చేసే ధైర్యం గల వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. నిజామాబాద్ నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ధైర్యంగా నిలబడి రాష్ట్రం సాధించిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు బతుకమ్మ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గర్తించి నిర్వహించేందుకు అన్ని విధాలుగా సహకారం అందించారని చెప్పారు. తెలంగాణ బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు ముఖ్యంగా సద్దుల పండుగ చీర సంబురంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో చీరలను పంపిణీ చేస్తున్నారన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, భూపాల్‌రెడ్డి, ఆకుల లలిత, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్, వేముల ప్రశాంత్, జీవన్‌రెడ్డి, షకీల్ అమీర్, జడ్పీ చైర్మెన్ రాజు, నిజామాబాద్ మేయర్ ఆకుల సుజాత, తదితరులు పాల్గొన్నారు.