Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ బీసీ సంక్షేమం
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
ప్రొఫెసర్ కంచ ఐలయ్యను హతమారుస్తామని ఆర్యవైశ్యులు బెదిరించడం సరికాదని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తెలిపింది. ఆయన కోమట్లపై ఆయన రాసిన పుస్తకంలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటే చర్చించి తొలగించడం లేదా ఖండిస్తూ మరో పుస్తకం రాసే స్వేచ్చ వైశ్యులకు ఉందని ఈ విషయంపై రాద్దాతం చేయడం సరికాదని సంఘం అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైశ్యుల మనో భావాలు దెబ్బతింటే శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు.
కలెక్టరేట్ల ముట్టడి వాయిదా
పెండింగ్లో ఉన్న బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ల నిధులను విడుదల చేయాలని కోరుతూ గురువారం తలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడి ఆందోళనను వాయిదా వేసినట్టు తెలంగాణ బీసీ కులాల ఫెడరేషన్ల సంఘం అధ్యక్షులు మొగిలిచర్ల వీరన్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.