Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేసు నమోదైతే ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి మీడియాతో మాట్లాడారు.. కంచ ఐలయ్యపై కేసులు నమోదై ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బతుకమ్మ చీరల వివాదంపై స్పందిస్తూ బతుకమ్మ చీరలపై ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీల సర్పంచ్‌లు చీరలను తగులబెట్టిస్తున్నారని చెప్పారు. హోంగార్డుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఆత్మహత్యలకు ఎవ రూ పాల్పడొద్దని కోరారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లా డుతూ బీజేపీ, టీడీపీ నేతలు హోంగార్డులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకో వాలని అన్నారు. వారి విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.
ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌కు క్వాలిటీ కౌన్సిల్ అవార్డు
ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌ను ప్రతిష్టాత్మక క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవార్డు వరించింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ రూపొందించిన జీపీఎస్ ఆధారిత మొబైల్ యాప్‌కు ఈ అవార్డు దక్కింది. ట్రస్ట్ సీఈవో డాక్టర్ కె. మనోహర్ ఈ నెల 22న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డును స్వీకరించనున్నారు. జీపీఎస్‌తో అనుసంధానం చేసిన ఆరోగ్య శ్రీ యాప్ ద్వారా 10 కిలోమీటర్ల పరిధిలోని దవాఖాన వివరాలను తెలుసుకోవచ్చు.
హెల్త్‌కార్డులు మంజూరుపై అభినందనలు
సెర్ప్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు మంజూరు చేయడం పట్ల సెర్ప్ ఉద్యోగుల గుర్తింపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సయ్య సంబంధింత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుండి కార్డులు కూడా అమలులోకి వచ్చాయన్నారు. అదేవిధంగా యల్1, యల్2 ఉద్యోగులు, ఇతర ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించాలన్నారు.
రిమాండ్ మహిళలకూ బతుకమ్మ చీరలు
తెల్లరేషన్ కార్డులో పేరున్న 18 ఏండ్లకు మించి ఉన్న మహిళలకే కాకుండా సమాజంలోని పలు వర్గాల మహిళలకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బతుకమ్మ చిరు కానుకలను సంబంధిత మహిళలకు అందజేయాల్సిందిగా పేర్కొంటూ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. అనాథాశ్రమం, వ ద్ధాశ్రమం, సామాజిక సేవా సంస్థలు, రిమాండ్ మహిళా ఖైదీలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలు అందజేయనుంది. హైదరాబాద్‌లోని సేవా సంస్థల మహిళలకు చీరలను జీహెచ్ఎంసీ కమిషనర్ పంపిణి చేయనున్నారు. అదేవిధంగా జిల్లాల్లోని సేవాసంస్థల్లో కలెక్టర్లు సంబంధిత మహిళలకు చీరలు అందించనున్నారు.