Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నవీపేట్
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని నాడపూర్లో గుర్తుతెలియని దుండగులు సోమవారం రాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని చేశారు. విగ్రహం ముక్కు, చూపుడు వేలు, చేతి మడిమ వద్ద ధ్వంసమైంది. మంగళవారం ఉదయాన్నే గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. నిజామాబాద్ రూరల్ సీఐ బుచ్చయ్య, ఎస్ఐ నరేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అంబేద్కర్ విగ్రహాలను తరచూ ధ్వంసం చేస్తున్నారని, దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ సంఘాల నాయకులు ధర్నా చేశారు.