Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యంతనాణ్యతతో ఆరువేల కిలోమీటర్ల రోడ్లు
- మూడేండ్లలో కనెక్టివిటీ మార్గాలు : మంత్రి తుమ్మల
- ఈ నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తే మంత్రి పదవి వదులుకుంటా
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
నేషనల్ హైవే రోడ్ స్థాయిలో కింది నుంచి రోడ్ తవ్విస్తామని, మూడేండ్లలో గ్రామీణ, మండల, జిల్లా కేంద్రాల కనెక్టివిటీ కోసం నిర్మిస్తున్న రోడ్డు గుంతలు పడితే రాజీనామాకు సిద్ధమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో అన్నారు. తెలం గాణలో ఆరు వేల కిలోమీటర్ల రోడ్లు అత్యంత నాణ్యతతో నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. రోడ్లు పదేండ్లు గ్యారెంటీగా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. హైదరాబాద్ రోడ్లను శాశ్వతంగా నిర్మిస్తామని, డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్లు నిర్మించాకే రోడ్లు వేస్తామన్నారు.