Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాప్రోస్కోపిక్ కోలేసిస్టెక్టమీ సదస్సు
హైదరాబాద్ : సిటిజెన్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి... 'సాధారణం నుంచి కష్టంగా' అనే థీమ్‌తో లాప్రోస్కోపిక్ కోలిసిసెక్టమీ సదస్సు శనివారం నిర్వహించింది. హైదరాబాద్, నల్లగండ్లలోని ఆస్పత్రి ఆవరణలో అసోసియేషన్ ఆఫ్ సర్జన్ ఆఫ్ ఇండియా(ఎఎస్ఐ), తెలంగాణ వారి సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సిటిజెన్స్ స్పెషాలిటీ ఆస్పత్రి లాప్రోస్కోపిక్్, బారియాట్రిక్స్ సర్జన్ చీఫ్ జనరల్ డాక్టర్ సురేశ్ చంద్ర హరి అధ్యక్షత వహించారు. ఈ సదస్సుకు భువనగిరి పార్లమెంట్ సభ్యులు బూర నర్సింహ గౌడ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గాల్ బ్లాడర్ స్టోన్స్(పిత్తాశయ రాళ్లు) శస్త్ర చికిత్స నిర్వహణలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, కొత్త చికిత్సలు, లాప్రోస్కోపిక్ కోలేసిస్టెక్టమీలో తాజా పురోగతిపై వైద్యుల సమాచారాన్ని సమీకరించుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సురేశ్ చంద్ర మాట్లాడుతూ... లాప్రోస్కోపిక్్ శస్త్ర చికిత్స ద్వారా గాల్ స్టోన్స్ నిర్వహణలో ఇటీవల అభివృద్ధి చెందిన చికిత్సల ప్రకారం తక్కువగా నొప్పితో 2-3 రోజుల్లోనే కోలుకునే అవకాశముందని తెలిపారు. ఈ సదస్సులో 120కి పైగా ప్రముఖ శాస్త్ర వైద్యులు పాల్గొన్నారు.