Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్లయింగ్ పీఎంఓగా రూపకల్పన
- క్షిపణిదాడులను ఎదుర్కొనేలా రాడార్ వ్యవస్థ
- 2020 నాటికి అందుబాటులోకి..
ఆకాశ ప్రయాణాలకు ఎప్పుడు ముప్పు పొంచి ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇటీవల చిన్న ఏమరుపాటుతో జరిగే ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశప్రధాని, రాష్ట్రపతి ప్రయాణాలు ఎంతవరకు సేఫ్..? ప్రస్తుతం మోడీ, రామ్‌నాథ్ కోవింద్‌లకు వాడుతున్న విమానాల భద్రతపై భద్రతా దళాలు దృష్టి పెట్టాయి. క్షిపణి దాడులతో నిరోధించే విధంగా విమానాలను వారికి సమకూర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఇంతకీ పలు దేశాల అధ్యక్షుల అధ్యక్షులు వాడే విమానాలు ఏవీ..? అందులో ఎలాంటి సౌకర్యాలున్నాయో..ఓ లుక్కేద్దాం
నవతెలంగాణ జనరల్ డెస్క్
దేశ ప్రధాని, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కోసం ప్రత్యేక విమానాలు సిద్ధమవుతున్నాయి. ఈ విమానాల్లో రాడార్లతో జామ్ చేయవచ్చు. న్యూక్లియర్ దాడులను నిరోధించే శక్తి ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఎమర్జెన్సీ కోసం ఆపరేషన్ థియేటర్ కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఈ విమానం 2020 నాటికి రెడీ కానున్నది. దీని కోసం బోయింగ్ 777.. 300 ఈఆర్ విమానాలను ఫ్లయింగ్ పీఎంఓ రూపాన్ని ఇవ్వనున్నారు. విమాన ఎత్తు 60 ఫీట్లు. ఇక ప్రధాని వినియోగించే విమానంలో అమర్చనున్న పలు సౌకర్యాలు గోప్యంగా ఉంచుతున్నారు.
ప్రత్యేకతలు ఇవే..
242 అడుగుల పొడవు, వింగ్స్పేస్ 212 అడుగుల వెడల్పు ఉంటుంది. విమానం టేకాఫ్ అయితే ఎక్కడా ఆగకుండా 13650 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు. ఎయిర్ ఫ్యూయూలింగ్తో ఎమర్జెన్సీ సమయంలో..ఎన్నిగంటలైనా ఆకాశంలో ఉంచేలా రూపకల్పన చేస్తున్నారు. విమానంలో రెండు ఫుడ్ గ్యాలరీలు ఉంటాయి. ఈ గ్యాలరీలో ఒకేసారి వంద మంది భోజనం చేయవచ్చు. విమానంలో సుమారు రెండు వేల మందికి అవసరమైన ఆహారాన్ని స్టోరేజీ చేయవచ్చు. ఇక వైద్య పరంగా వెంటిలేటర్, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్‌నూ అమర్చుతారు.
ప్రెస్ ఏరియా, కాన్ఫరెన్స్ రూమ్, డైనింగ్ రూమ్‌లు ఉంటాయి. అవసరాన్ని బట్టి గదుల సైజును పెంచుకోవచ్చు.లేక తగ్గించవచ్చు. .టెలివిజన్ సైట్స్, రేడియా సైట్స్, ఫ్యాక్స్ మిషన్ సౌకర్యాలతో పాటు 50కి పైగా టెలిఫోన్ లైన్స్ ఏర్పాటు చేయనున్నారు. విమానాన్ని గురిపెట్టే రాడార్లను జామ్ చేస్తాయి. ఆన్ ఎయిర్ దాడులతో నష్టం జరగకుండా స్పెషల్ విమానాన్ని సిద్ధం చేస్తున్నారు.
డొనాల్డ్ ట్రంప్
ఎయిర్‌ఫోర్స్ వన్..మరో రెండు విమానాలు
అమెరికా అధ్యక్షుడు వాడే ఎయిర్‌ఫోర్స్ విమానం గురించి పెద్దగా చర్చించుకుంటారు. బోయింగ్ 74..200 బీ డబుల్ డెక్కర్ ఇది. ఇది ప్రపంచంలోనే తొలి డబుల్ డెక్కర్ విమానం.
70 మంది ప్రయాణికులతో పాటు 26 మంది క్రూ మెంబర్స్ వెళ్లేలా వినియోగిస్తున్నారు. వీసీ 25 ఏ, బోయింగ్ సీ 32 కూడా వాడుతున్నారు. దీనికి ఎలక్ట్రోమ్యాగెట్ దాడులను నిరోధించే సామర్థ్యం ఉన్నది.
2.వ్లాదిమిర్ పుతిన్..(రష్యా అధ్యక్షుడు)
ఒకే తరహా నాలుగు విమానాలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వదేశీ ఇల్యూషన్ ఐఎల్..96 విమానాన్ని వినియో గిస్తున్నారు. ఇందులో రాడర్ జామింగ్ టెక్నాలజీ ఉన్నది. అయితే నాలుగు విమానాల్లో పుతిన్ ఎందులో ప్రయాణిస్తునారో తెలియకుండా రక్షణా బలగాలు అత్యంత గోప్యంగా ఉంచుతాయి.
3.జింగ్పింగ్..(చైనా అధ్యక్షుడు)
ఎయిర్ చైనా బోయింగ్ 747..400 విమానంలో ప్రయాణిస్తుంటారు. ఆయన పర్యటనకు వెళ్లేటప్పుడు విమానంలో ఉన్న సీట్లను తొలగించి..లివింగ్ రూమ్, బెడ్రూమ్ కం ఆఫీసుగా మార్చేస్తారు.
4.ఖతర్ అమీర్ తమీమ్ బిన్ హమద్ అల్ధానీ
ఖతర్ అమీర్ వద్ద ప్రత్యేకమైన విమానాలు బోలేడున్నాయి. ఇందులో ఎయిర్‌బస్ ఏ 320, రెండు ఏ 330, మరో రెండు బోయింగ్ 747..8 ఉన్నాయి. ఆయన పర్యటన ఏర్పాట్ల కోసం వెయ్యిమంది సిబ్బంది అందుబాటులో ఉంటారు.
5.థెరిసా మే..
యూకే ప్రధాని థెరిసా మే వద్ద ప్రత్యేకమైన విమానం ఉన్నది. ఎయిర్‌బస్ ఏ 3301 విమానంలో ఫ్రంట్ క్యాబిన్ వద్ద చిన్న వీఐపీ జోన్ ఉంటుంది. ఇక్కడ 58 మంది కూర్చొనే విధంగా..ప్రీమియర్ స్టయిల్ సీట్లు ఉంటాయి. సిబ్బంది, మంత్రివర్గ బృందం వెళ్లవచ్చు.
6.ఏంజెలా మెర్కెల్..జర్మన్ ఛాన్స్లర్
జర్మన్ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ అవసరాన్ని బట్టి విమానాలను వినియోగిస్తుంటారు. ఆమె వాడే రెండు విమానాలు పేరుaల కోన్రాడ ఎకిన్వార్, థియోడోర్ హిఆమ్
రెండు ఎయిర్‌బస్ ఏ 340..212 ఎక్స్‌ను 2011లో ఆధునీకరించారు. ఇందులో 150 మంది ప్రయాణించవచ్చు. జర్మన్‌లోని అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ లూఫ్తాన్సా ఎయిర్‌బేస్ ఏ 340 ఛాన్స్లర్ వెళ్లేలా ఆధునీకరించింది. ఈ విమానంలో బెడ్రూమ్తో పాటు భద్రతాపరమైన అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టి డిజైన్ చేశారు.
మరో రెండు ఎయిర్‌బస్ ఏ 319, బాంబార్డియర్ గ్లోబjల్ 5000 విమానాలున్నాయి. వీటన్నింటిలో యాంటీ మిస్సైల్ టెక్నాలజీ ఉన్నది. దేశీయ పర్యటనకు యూరోక్రాఫ్ట్ ఏఏఎస్532ను వినియోగిస్తారు.
7.ఇమ్మానియూల్ మేక్రాన్ (ఫ్రాన్స్ అధ్యక్షుడు)
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియూల్ మేక్రాన్ ఎయిర్‌బస్ ఏ 330..200ను వాడుతున్నారు. ఇందులో బెడ్రూమ్, డ్రెస్సింగ్ రూమ్, కిచెన్, ఆఫీస్, సౌండ్ ఫ్రూఫ్ నెగిషియన్ రూమ్ కూడా ఉంటుంది. మీడియా సమావేశాలకు ప్రత్యేక వసతి ఉన్నది.
8.బ్రూనై సుల్తాన్ వద్ద పసిడి విమానం
బ్రూనై సుల్తాన్ వద్ద ఉన్న విమా నాన్ని ఫ్లైయింగ్ ప్యాలెస్‌గా అభివర్ణి స్తారు. ఆయన వినియోగించే విమా నంలో వజ్ర వైఢూర్యాల నగిషీలతో చెక్కి ఉంటుంది. ఈ విమానంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.