Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
ప్రయివేటు పాఠశాలల గుర్తింపునకు పాఠశాల విద్యాశాఖ విద్యాశాఖ వినూత్న పద్దతికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో మే, జూన్ నెలల్లో స్ట్రీట్ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణలో సుమారు 11వేల ప్రయివేటు పాఠశాలలున్నాయి. వీటిలో చాలా పాఠశాలలు నిబంధనల ప్రకారం లేవు. ఒక చోట గుర్తింపు తీసుకుని, మరోచోట పాఠశాలలు కొనసాగిస్తున్నాయి. వీటికితోడు కొన్ని పాఠశాలలు గుర్తింపు లేకుండానే కొనసాగుతున్నాయి. వీటిన్నింటినీ పరిశీలించేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో స్ట్రీట్ సర్వే టీములను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ టీములిచ్చే నివేదికల ఆధారంగా ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు నవతెలంగాణతో చెప్పారు.