Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మోడల్ కెరీర్ సెంటర్ (ఎంసీసీ) ఉస్మానియా యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఈనెల 26న ఉద్యోగ మేళా జరగనుంది. ఈ మేరకు యూనివర్సిటీ మోడల్ కెరీర్ సెంటర్ డైరెక్టర్ డి బలరాములు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 26న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉద్యోగ మేళా జరుగుతుందని తెలిపారు. ఏదైనా డిగ్రీ, పీజీ అర్హత ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వియోగం చేసుకోవాలని సూచించారు. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కనెక్ట్ క్యాంపస్ సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు (www.employment.telangana.gov.in) వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని, రెజ్యూమ్‌తో హాజరుకావాలని సూచించారు.