- ఓటరు జాబితా సవరణలో అనేక లోపాలు నవతెలంగాణ - బోడుప్పల్ ఓటర్ల జాబితాలో అనేక లోపాలు చోటు చేసుకు న్నాయి. పక్కా ప్రణాళికతో ఓటర్ల నమోదు, సవరణలు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ పరిస్థితి అందుకు భిన్నం గా ఉంది. ఒకే ఇంటి నెంబర్‌తో వందల ఓట్లు ఉండటం గమనార్హం. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మం డలం బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని శ్రీనివాస్‌కాలనీ పోలింగ్ బూత్ నెంబర్ 437లో ఇంటి నెంబర్ 8-48/ 12/2పై 103 ఓట్లు ఉన్నాయి. బుడగ జంగాలకాలనీలో ఇంటి నెంబర్ 8-49/1/సీలో 45 ఓట్లు, 8-72/26 ఇంటి నెంబర్‌పై 62 ఓట్లు, 8-75/1 పై 44 ఓట్లు, 8-48/2/22లో 42 ఓట్లు నమోదై ఉన్నాయి. ఇందులో సొంత ఇండ్లు కలిగి ఉన్న వారితో పాటు ఇతరుల ఓట్లూ ఉన్నాయి. కావాలనే ఎవరైనా చేశారా..? లేదా అధికారు ల తప్పిదమా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు రెండు నెలలు కష్టపడి ఇంటింటికీ తిరిగి ఓటర్ల జాబితా రూపొందించిన అధికారులకు ఇలాంటి తప్పిదాలు ఎం దుకు కనపడలేదో అర్థం కావడం లేదంటూ పలు రాజకీయ పార్టీల నేతలు వాపోతున్నారు. విచారణ చేపట్టాలి: ఎన్ సృజన సీపీఐ(ఎం) మేడిపల్లి మండల కార్యదర్శి ఓటరు జాబితాలో ఒకేఇంటి నెంబర్‌పై 100కుపైగా ఓట్లు ఎలా నమోదయ్యాయ్యే రెవెన్యూ అధికారులు వివరణఇవాల్సి ఉంది. పక్కా ప్రణాళికబద్దంగా ఓటరు జాబితా రూపొందించామని చెప్పిన అధికారుల మాటలకు పొంతన లేకుండా పోయింది. దీనిపై పూర్తి విచారణ జరిపించాలి.