Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అడ్డగుట్ట
ప్రేమించాలని వెంటపడ్డాడు. మాట వినకపోయే సరికి ఏకంగా ఇంటికొచ్చి వేధించాడు. ఆ వేధింపులు భరించలేక ఇంట్లో ఉరేసుకుని ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ అడ్డగుట్ట ప్రాంతంలోని తుకారం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం... అడ్డగుట్టలోని వెంకట్‌నగర్‌కు చెందిన శివాని(15) పదో తరగతి చదువుతున్నది. అదే ప్రాంతానికి చెందిన ప్రణరు అనే యువకుడు తనను ప్రేమించాలని ప్రతి రోజూ శివానిని వేధించసాగాడు. శివాని అతని గురించి పట్టించుకోకపోయేది. రోజురోజుకూ వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో శివాని సోమవారం సాయంత్రం ట్యూషన్ నుంచి ఇంటికి వస్తుండగా ప్రణరు ఆమెను అనుసరిస్తూ ఏకంగా ఇంటికే వచ్చేశాడు. దీంతో శివాని వేధింపులు భరించలేక మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి మల్లీశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.