Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్కు రాజీనామాలు..
నవతెలంగాణ- ఖమ్మం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి బాధ్యత వహిస్తూ పలువురు తమ పదవులకు రాజీనామా చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి ఓటమి పాలైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ కల్లూరు మండలానికి చెందిన యువజన సంఘాల నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. టీఆర్ఎస్ యువజన విభాగం సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ అయూబ్పాషా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. జిల్లాలో తుమ్మల, పిడమర్తిల ఓటమి తనను ఎంతగానో బాధించిందని వెల్లడించారు.
టీఆర్ఎస్ మధిర మండల అధ్యక్షులు దొండపాటి వెంకటేశ్వరరావు అధ్యక్ష పదవికి బుధవారం రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజు ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తాను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు.