Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఏఎఫ్ఆర్సీ కసరత్తు
- రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్
- వృత్తి విద్యా కాలేజీల నుంచి ఆదాయ, వ్యయాల స్వీకరణ
- వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త ఫీజులు అమల్లోకి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం (2019-20) నుంచి వృత్తి విద్యాకోర్సులకు కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. నిబంధనల ప్రకారం వృత్తి విద్యాకోర్సుల ఫీజులను మూడేండ్లకోసారి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఖరారు చేస్తుంది. 2016-17లో ఖారారైన ఫీజులు 2018-19 విద్యాసం వత్సరం వరకు అమల్లో ఉంటాయి. దీంతో వచ్చే విద్యాసం వత్సరం నుంచి మూడెండ్ల వరకు వసూలు చేసే ఫీజులను టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్ పోస్టు ఖాళీగా ఉంది. ప్రభుత్వం భర్తీ చేయలేదు. కె చంద్రశేఖర్‌రావు రెండోసారి ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్‌ను నియమించే అవకాశమున్నది. కానీ చైర్మెన్ నియామకం ఆలస్యమైతే ఫీజుల ఖరారుపై ప్రభావం పడనుంది. అందుకే టీఏఎఫ్ ఆర్సీ చైర్మెన్ లేకపోయినా పాత కమిటీకి ఇంకా అధికారాలు న్నాయి. దీంతో ఫీజుల ఖరారుకు సంబంధించి కాలేజీల నుంచి ఆదాయ, వ్యయాల వివరాలను సమర్పించేందుకు టీఏఎఫ్ఆర్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 2019, జనవరి చివరి వరకు కాలేజీ యాజమాన్యాల నుంచి ఆదాయ, వ్యయాల సమర్పణకు గడువు ఇచ్చే అవకాశ ముంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం టీఏఎఫ్ ఆర్సీ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశమున్నది. వచ్చే విద్యాసంవత్సరం ఖరారయ్యే ఫీజులు 2019-20, 2020-21, 2021-22 విద్యాసంవత్సరాల వరకు అమల్లో ఉంటాయి. యూజీసీ వేతనాలు పెరగడం, నిర్వహణ, ఇతర ఖర్చుల వల్ల ఇంజి నీరింగ్, ఇతర కోర్సులు నడపడం యాజమాన్యాలపై భారం పడిందని తెలుస్తున్నది. దీంతో ప్రస్తుతం నిర్ణయించిన ఫీజులు 20 శాతం పెరిగే అవకాశముందని సమాచారం. ఇంజినీరింగ్‌తోపాటు వృత్తి విద్యాకోర్సుల కాలేజీ యాజమాన్యాలు సమర్పించే ఆదాయ, వ్యయాల ఆధారంగా టీఏఎఫ్ఆర్సీ సమగ్రంగా అధ్యయనం చేసి ఫీజులను ఖరారు చేస్తుంది. ఆ ఫీజులను ప్రభుత్వం ఆమోదిస్తుంది. గతంలో కొన్ని కోర్సుల ఫీజులను ప్రభుత్వం పెంచలేదు. పాత ఫీజులనే కొనసాగించింది. ఈ నేపథ్యంలో ఆ కోర్సుల ఫీజులూ పెరిగే అవకాశమున్నట్టు తెలిసింది. ఇంజినీరింగ్ ఫీజులకు సంబంధించి శ్రీకృష్ణ కమిటీ సిఫారసులను పరిశీలించే అవకాశముంది. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకొని ఫీజులను టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేయనుంది.