Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్:కేఎల్ డీమ్డ్ వర్సిటీ మరో అరుదైన హోదాను దక్కించు కున్నది. ఈ యూనివర్సిటీకి కేటగిరి-1 కింద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తింపునిచ్చింది. దేశంలో 26 విద్యాసంస్థలు మాత్రమే ఇలాంటి గుర్తింపు కలిగి ఉన్నాయనీ కేఎల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కార్యదర్శి కోనేరు శివ కాంచన లత వెల్లడిం చారు. బుధవారం విలేకర్ల సమాy ేశంలో ఆమె మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా మొత్తం 578 విద్యా సంస్థలను రివైజ్డ్ న్యాక్ గుర్తింపు కోసం పరిశీలించగా అందులో కేవలం ఆరు విద్యాసంస్థలకు మాత్రమే న్యాక్ ఏ++ హోదాను పొందాయని తెలిపారు. అందులో మూడు డీమ్డ్ వర్సిటిలకు ఏ++ హోదా కేటాయించారనీ, ఆ వర్సిటీల్లో కేఎల్ వర్సిటీ ఉండటం తమకు గర్వకారణమన్నారు. యూజీసీ కేటగిరి -1 హోదాను పొందిన సంస్థలు అనేక డిగ్రీ, పీజీ కోర్సులను ఓపెన్, దూర విద్యావిధానం ద్వారా అందించవచ్చన్నారు. కొత్త కోర్సులను కూడా ఎటువంటి అనుమతులకు వేచి చూడకుండా ప్రారంభిచ్చుకోవచ్చని తెలిపారు. కేఎల్ వర్సిటీ ఉపకులపతి డాక్టర్ ఎల్ఎస్ఎస్ రెడ్డి మాట్లా డుతూ... తమ వర్సిటికీ అనుబం ధంగా ఎక్కడైనా ప్రత్యేక విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. ఈ యేడాది క్యూఎస్ బ్రిక్స్‌లో ర్యాంకు సాధించామ న్నారు.ఎన్ఐఆర్ఎఫ్ కింద ప్రకటిం చిన .కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకుల్లో అఖిల భారత స్థాయిలో 49వ ర్యాంకు సాధించామని తెలిపా రు. రానున్న యేడాదిలో వివిధ కోర్సులను అందించేందుకు ప్రతిపాద నలు చేస్తున్నామన్నారు. అందుకోసం అన్ని రకాల మౌళిక వసతులను ఏర్పాటు చేస్తామని తెలిపారు.