Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు
- వల్లే ఈ నియామకం : సీఎం కేసీఆర్
పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతల అభినందన నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు టీఆర్ఎస్లో కీలక పదవి దక్కింది. ఆయన్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. పార్టీ అధ్యక్షు డు కేసీఆర్ శుక్రవారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి వీలుగా జాతీయ రాజకీయాలపై దష్టి కేంద్రీకరించాలని కేసీ ఆర్ భావిస్తున్నారు. ప్రభుత్వ పరంగా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు, ఎన్ని కల్లో ప్రజలకిచ్చిన వాగ్ధానాలను తూ.చా. తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యతలు తనపై ఉన్న దష్ట్యా, అత్యంత నమ్మకస్తుడు, సమర్ధుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావించిన కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసు కున్నారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 'తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వేదిక ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ ప్రత్యే క రాష్ట్రాన్ని సాధించింది. రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ బంగారు తెలంగాణ నిర్మాణం దిశ గా బలమైన అడుగులు వేసింది. తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష అని ప్రజలు ఏకోన్ముఖంగా భావించి, ఇటీవల ఎన్నికల్లో తిరుగులేని విజయం అందించారు. తెలంగాణ ప్రజలకు టిఆర్ఎస్ పార్టీపై అచం చల విశ్వాసం ఉంది. తెలంగాణ భవిష్యత్తుకు టీిఆర్‌ఎస్ అత్యంత పటిష్టంగా ఉండాలని ప్రజలు కోరుకుంటు న్నారు. జాతీయ రాజకీ యాల్లో క్రియాశీల పాత్రపోషించడం, రాష్ట్రం లో అభివద్ధి కార్యక్రమాలను ముందుకు తీసు కుపోవాల్సి ఉండడంతో కేసీఆర్‌పై పనిభారం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ తాను అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను, పార్టీలో తాను అత్యంత ఎక్కువ గా విశ్వసించే కేటీఆర్‌కు కేసీఆర్ అప్పగిం చారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించడం, సంస్థాగతంగా తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ను తీర్చిదిద్దే బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించారు. భారతదేశంలోనే అతి గొప్ప పార్టీగా టీఆర్ఎస్ను
రూపుదిద్దా లనే సంకల్పంతో కేసీఆర్ ఉన్నారు. ఇప్పటి వరకు అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో ఇచ్చిన బాధ్యతలన్నీ అత్యంత విజయవంతం గా నిర్వహించిన కేటీఆర్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించారు. కేటీఆర్ పనితీరు, నిబద్ధత, దార్శనికత, నాయకత్వ లక్షణాలు పార్టీని సుస్థిరంగా, సుభిక్షంగా నిలుపుతాయని కేసీఆర్ విశ్వసిస్తు న్నారు.' అని సీఎంవో తన ప్రకటనలో తెలిపింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్‌ను.. ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు అభినందించారు. ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాసయాదవ్, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, పద్మారావు తదితరులు కేటీఆర్‌ను అభినందించారు.
పూర్తిగా సహకరిస్తా : హరీశ్
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కేటీఆర్‌కు పూర్తిగా సహకరిస్తానని హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం ఉదయం కేటీఆర్.. హరీశ్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా హరీశ్.. కేటీఆర్‌కు శుభా కాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఆయన మరింత పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. పార్టీని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవటంలో ఇరువురమూ కలిసి పనిచేస్తామని తెలిపారు. పార్టీ సెక్రటరీ జనరల్ కేకే నివాసానికి వెళ్లిన కేటీఆర్.. ఆయన ఆశీర్వాదం పొందారు.