Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షేమ పథకాల అమలు వేగవంతం
- బీసీల రుణాల పంపిణీకి సిద్ధం
- రుణాల కోసం ఎదురు చూపులు
బీసీ కార్పొరేషన్ రుణాల కోసం విద్యావంతులైన నిరుద్యోగులు ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు 12 లక్షల మంది రుణాల కోసం బీసీ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే గత నాలుగున్నర టీఆర్ఎస్ ప్రభుత్వ హాయాం టలో కేవలం 1.13లక్షల మందికి మాత్రమే రుణాలు అందజేశారు. మిగతా వారిని కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం తప్పా ఎవరికీ రుణాలు ఇవ్వలేదు. కనీసం ఈ కొత్త ప్రభుత్వంలోనైనా అర్హులైన బీసీలందరికీ రుణాలు అందజేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
ఎస్సీలకు సబ్సిడీ రుణాలు
ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులందరికీ రుణాలు అందించేందుకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఈ నెలాఖరులోపు గతంలో ఎంపికైన వారందరికీ సబ్సిడీ రుణాలు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దాంతో సుమారు 40వేల మంది లబ్దిదారులకు రుణాలు అందే అవకాశం ఉంది.