Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదిలాబాద్ కౌన్సిలర్ రాజీనామా
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నకు మంత్రివర్గంలో చోటు కల్పించనందుకు నిరసనగా జిల్లా కేంద్ర మున్సిపాలిటీ కౌన్సిలర్ జనగం సంగీత సోమవారం పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు జనగం సంతోష్ సైతం పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే రామన్నకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో జిల్లాలో నాయకులు, కార్యకర్తలు ఒకింత నిరుత్సాహంతో ఉన్నారు. 8వ వార్డు కౌన్సిలర్ సంగీత బీజేపీ నుంచి కౌన్సిలర్‌గా గెలిచి అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరారు.