Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగిపోయిన అలనాటి టాప్ బ్రాండ్ వాహనాలు
- జిప్సీ, ఓమ్నీలను నిలిపివేసిన మారుతి సుజుకీ
- టాటా, మహీంద్రా సంస్థలు కూడా అదే బాట!
- హై సెక్యూరిటీ ఫీచర్లు, ఉద్గార ప్రమాణాలే కారణం..
అధునాతన వాహనాలు, హై సెక్యూరిటీ ఫీచర్లు, మునుపటితో పోలిస్తే తగ్గుతున్న విక్రయాలు.. ముఖ్యంగా.. 2020 ఏప్రిల్ ఒకటి తర్వాత ఇండియాలో స్టేజ్-4 ఉద్గార ప్రమాణాల వాహనాలను విక్రయించరాదని, అదే తేదీ నుంచి దేశవ్యాప్తంగా బీఎస్-6 ప్రమాణాలు అమల్లోకి వస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో సుదీర్ఘకాలంగా వాహనరంగంలో ఏకఛత్రాధిపత్యం వహించిన ప్రముఖ బ్రాండ్ల మోడళ్ళు, వాహనాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి.
జిప్సీ ఇక కనుమరుగు!
33ఏండ్ల క్రితం భారత విపణిలో అడుగుపెట్టిన జిప్సీ ఎస్యూవీ స ష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకీ ఈ బ్రాండ్ ను తీసుకొచ్చింది. దేశంలో సాధారణ పౌరుల కంటే ఎక్కువగా సాయుధ బలగాలు, పోలీసులు ఈ జిప్సీ వాహనాన్ని ఎక్కువగా వినియోగించేవారు. డిజైన్, ఫీచర్లు, ప్రస్తుత ఉద్గార నిబంధ నలను చేరుకోలేక పోవ డంతో ఈ ఎస్‌యూ వీని నిలిపివేసేందుకు మారుతి నిర్ణయించింది. కాగా, ఇప్పటి వరకు ఆర్డర్ల ప్రాతిపదికన మాత్రమే ఈ ఎస్‌యూ వీని మారుతి తయారు చేస్తున్న విషయం విదితమే!
'ఓమ్నీ'కి బ్రేక్!
1984 సంవత్సరం నుంచి భారతదేశంలో చిన్న, మధ్యతరహా వ్యాపారస్తులకు, పాఠశాల ట్రాన్స్ పోర్టు వగైరాలకు తన సేవలను అందిస్తూ మారుతి సుజుకీ సంస్థ నుంచి వచ్చిన ఓమ్నీ వాహనం గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఐతే, మారిన నిబంధనల మేరకు ఓమ్నీ విక్రయాలకు ఈ ఏడాది జులై నుంచి బ్రేక్ వేసి మరో మోడల్ ను ఓమ్నీ స్థానంలో మారుతి సుజుకీ తీసుకువస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మిగతా వాహనాలతో పోలిస్తే రూ. 2.85 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చిన ఓమ్నీ విక్రయాలు ఇప్పటికీ నెలకు ఏడువేల వరకు ఉండటం విశేషం.
సంచలన కార్లు కూడా!
దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ బ్రాండ్ విస్తరణకు, మార్కెట్ వాటా వృద్ధికి ఎంతగానో దోహదపడిన పాపులర్ మోడల్స్ టాటా ఇండికా, ఇండిగోలకు టాటా మోటార్స్ గతంలోనే గుడ్‌బై చెప్పేసింది. కస్టమర్ల నుంచి ఆసక్తి తగ్గడం, పాత డిజైన్ల మూలంగానే సదరు సంస్థ ఈ పని చేసింది. తాజాగా బడ్జెట్ కారుగా తెరపైకి వచ్చిన టాటా వారి 'నానో' పరిస్థితి కూడా ఇలాగే తయారవ్వడం విదితమే! ఇక, ఇండియాలో అతి చిన్న ఎలక్ట్రికల్ కారుగా విపణిలో అడుగుపెట్టిన మహీంద్రా ఈ2ఓ కూడా వినియోగదారులను ఆకట్టుకోవడంలో.. పోటీలో నిలవడంలో చతికిలపడి ఆగిపోయింది.