Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు శాఖలకు చెందిన నకిలీ ఐడీలు,
- రబ్బర్ స్టాంప్‌ల స్వాధీనం :సీపీ అంజనీకుమార్ వెల్లడి
నవతెలంగాణ-సిటిబ్యూరో
నకిలీ ఐపీఎస్ అధికారిని టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి ఎయిర్‌గన్, నకిలీ రబ్బర్ స్టాంప్‌లు, ఫేక్ ఐడీ కార్డులు, ల్యాప్‌టాప్, ఆరు సెల్ఫోన్లు, ఐప్యాడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సీపీ అంజనీకుమార్ గురువారం బషీర్‌బాగ్ పోలీస్ కమిషనరేట్‌లో డీసీపీ రాధాకిషన్ రావుతో కలిసి మీడియాకు వివరించారు. ప్రకాశం జిల్లా గిద్దలూర్కు చెందిన కె.గురువినోద్్ కుమార్‌రెడ్డి ఉన్నత చదువుల కోసం 2017లో హైదరా బాద్‌కు వచ్చాడు. గోల్కొండా చౌరస్తాలోని పురుషోత్తం అపార్ట్మెంట్లోని 207 ప్లాట్‌ను అద్దెకు తీసుకుని నివాస ముంటున్నాడు. సమీపంలోని ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లో సివిల్స్ కోచింగ్ తీసుకున్నాడు. ఏపీఎస్సీ, ఐఎఫ్ఎస్, ఎస్ఎస్సీసీజీఎల్, ఏపీపీఎస్(గ్రూప్-1)తోపాటు ఎస్ఐ ఉద్యోగాల కోసం పరీక్షలు రాశాడు. కానీ ఉద్యోగం రాలేదు. వినోద్‌కుమార్ తండ్రి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. తానుకూడా ఐపీఎస్ సాధిస్తానని కుటుంబ సభ్యులతోపాటు స్నేహితులు, బంధువుల మధ్య గొప్పలకు పోయాడు. సాధించకపోవడంతో నకిలీ ఐపీఎస్ అధికారిగా అవతార మెత్తాడు. 2016లో సివిల్ సర్వీసెస్‌లో ఎంపికై ఐపీఎస్ సాధించినట్టు స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువుల తో పాటు గ్రామస్తులను సైతం నమ్మించాడు. ఐపీఎస్ అధికారినంటూ ఐడీ కార్డులను సృష్టించాడు. అంతటితో ఆగకుండా ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ అధికారిగా అవతారమె త్తాడు. నకిలీ ఐడీకార్డులను తయారు చేసి పలువుర్ని నమ్మించాడు. సమాచారం అందుకున్న గిద్దలూరు పోలీసులు 2017లో ఆయన్ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. 2019లో జైలు నుంచి వచ్చిన అనంతరం 'ఎన్ఐఏ అసిస్టెంట్ కామాం డెంట్'గా ఐడీ కార్డులను సృష్టించాడు. సమాచారం అందు కున్న నేరేట్మెట్ పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. జైలు నుంచి తిరిగొచ్చిన తర్వాత అశోక్‌నగర్‌లోని ఆర్సీ రెడ్డి కోచిం గ్ సెంటర్లో పనిచేస్తున్న (ఎక్స్ ఆర్మీ) మేజర్ జి.శ్రీనివాస రావుతో తాను ఎన్ఐఏ అదనపు సూపరింటెండెంట్‌గా పరిచయం చేసుకున్నాడు. కొద్ది రోజుల్లోనే చనువు పెంచుకున్నాడు. ఆ తర్వాత శ్రీనివాస్‌రావు వద్ద ఉన్న ఎయిర్ గన్ను తస్కరించాడు. మూడు కమిషనరేట్ల పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో తాను ఎన్ఐఏ అధికారిగా పరిచయం చేసుకుని పైరవీలు చేస్తున్నాడు. ఇదే తరహాలో నకిలీ ఐడీ కార్డులను సృష్టించి సినిమా థియేటర్లు, రైల్వే రిజర్వేష్టన్లు, టోల్గేట్, షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో ఐపీఎస్ అధి కారిగా చలామణి అవుతున్నాడు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్సు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. గాంధీనగర్ ఎస్‌హెచ్‌వోతోపాటు ఇన్స్పెక్టర్ శైనీ శ్రీనివాస్‌రావు, ఎస్ఐ కె.శ్రీనివాసులు పాల్గొన్నారు.