Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ విద్యారంగంలో గొప్ప మార్పు తీసుకొస్తున్న సమయంలో జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తనపై ఆరోపణలు చేయడం దురదృష్టకరమని తెలంగాణ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాను చేపట్టిన వినూత్న కార్యక్రమాలు దేశ వ్యతిరేకమైనవని ఆరోపణలు చేయడం తీవ్ర మనోవేదన కలిగించాయని తెలిపారు. 24 సంవత్సరాల ఉద్యోగకాలం ఎంతో నిబద్ధతతో కొనసాగిందని, దీనికి నిదర్శనమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులే నిదర్శనమన్నారు.