Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్, ఉపసర్పంచ్ సంతకాలుండాల్సిందే
- ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనికి సంబంధించి తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018లో కొన్ని సెక్షన్లను చేరుస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం శనివారం జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టం 2018లో చెక్‌పవర్‌కు సంబంధించి 6 (10), 34, 37 (6), 43 (10), 47 (4), 70 (4), 113 (4), 114 (2), 141 సెక్షన్లను నోటిఫై చేసింది. గ్రామ పంచాయతీల్లో ఆడిటింగ్ బాధ్యతలు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. గ్రామసభకు ఉండాల్సిన కోరం, తదితర ఇతర అంశాలను పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్, 17, 2019 నుంచి సెక్షన్లు అమల్లోకి రానున్నాయి.