Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఆర్నగర్లో ఆలస్యంగా వెలుగులోకి
నవతెలంగాణ-అమీర్‌పేట
తనను పెండ్లి చేసుకోకపోతే నీ తల్లిదండ్రులు చనిపోతారని ఓ భూత వైద్యుడు యువతిని బెదిరించాడు. ఆపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. బోరబండకు చెందిన ఓ యువతి తల్లిదండ్రులు మల్లేపల్లిలో ఉంటున్న భూతవైద్యుడు ఆజమ్‌ని కలిశారు. తాము ఏ పని చేసినా కలిసి రావడం లేదని అందుకు పరిష్కారం చూపాలని అతడ్ని కోరారు. దీంతో అజామ్ కొద్ది రోజుల పాటు
వారిని తమ చుట్టు తిప్పుకొని ప్రార్థనల పేరుతో కాలయాపన చేశాడు. చివరకు మీ ఇంట్లో దెయ్యం ఉందనీ దానిని వదిలే వరకూ మీకు మంచి జరగదనీ భయాందోళనకు గురిచేశారు. అది నమ్మిన దంపతులు తమ కుమారైను తీసుకుని అజామ్‌తో కలిసి రెండు సార్లు బీదర్‌లోని ఓ దర్గాకు వెళ్లారు. అక్కడే ఆజామ్ యువతిని ఒంటరిగా కలిసి నీవు నన్ను పెండ్లి చేసుకోవాలని లేదంటే నీ తల్లిదండ్రులు చనిపోతారని భయపెట్టాడు. ఈ నెల 11న బోరబండలో యువతి ఇంటికి వెళ్లి ప్రార్థనల పేరుతో ఆమెను గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని తన పెద్దమ్మకు చెప్పడంతో ఆమె పోలీసులు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.