Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు లక్ష్మణ్ రూడవత్కు మెగా లెజెండరీ అవార్డు దక్కింది. హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలోని ఓ హౌటల్లో ఈ అవార్డును ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక అధికారి వేణుగోపాలచారి శనివారం అందజేశారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రజారోగ్యాన్ని కాపాడుతూ నర్సుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నందుకుగానూ ఆయనకు ఈ అవార్డు దక్కింది. మెగా ఆర్ట్ క్రియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, అమ్మ ఆర్ట్ క్రియేషన్ ప్రొడ్యూసర్ శ్రీరామ్ తిలక్, వెల్ టెక్ ఫౌండేషన్ చైర్మెన్ వీరా చారి, నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీను రాథోడ్, పారా మెడికల్ కో-ఆడిటర్ వంశీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.