Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం యోగి దిష్టిబొమ్మ దహనానికి యత్నం.. అడ్డగింత
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సోనాభద్ర జిల్లా ఉబ్బ గ్రామంలో జరిగిన ఆదివాసుల సామూహిక హత్యల ఘటనను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టీఏజీఎస్ నాయకులు నిరసన తెలిపారు. పట్టణంలోని బస్టాండ్ ఎదుట యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిష్టిబొమ్మ దహనానికి సోమవారం యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో నాయకులు అక్కడే బైటాయించారు. టీఏజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ మాట్లాడుతూ.. ఆదివాసీల పట్ల ఒక వైఖరి, రాజకీయ పార్టీల పట్ల మరోవైఖరి అవలంబించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆదివాసులను భూముల నుంచి ఖాళీ చేయించేందుకు రాజకీయ, ధనబలంతో పలుమార్లు బెదిరించారనీ, విషయం పోలీసుల వరకు వెళ్లినా అక్కడి ప్రజలకు న్యాయం జరగలేదనీ ఆవేదన వ్యక్తం చేశారు.