Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో విడత మెడికల్ కౌన్సిలింగ్‌పై స్టే ఎత్తేయండి
- హైకోర్టులో కాళోజి హెల్త్ యూనివర్సిటీ
- విచారణ నేటికి వాయిదా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర సర్కార్ 2017లో ఇచ్చిన జీవో 114 మేరకే ఎంబీబీఎస్, బీడీఎస్ రెండో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ జరిగిందని, ఫలానా విధంగానే జరగాలని సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఏమీ లేవని, స్టేను ఎత్తేయాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ హైకోర్టును కోరింది. మెడికల్ సీట్ల రెండో కౌన్సిలింగ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్లకు విఘాతం కలిగేలా ఉందంటూ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నూతెంకి భావన, ఇతరులు వేసిన రిట్ మంగ ళవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్‌కుమార్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన డివిజన్ బెంచ్ ఎదుట విచారణకు వచ్చింది. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రవీణ్‌కుమార్ వేసిన కౌంటర్‌ను పరిశీలించి తమ వాదనలు చెప్పడానికి ఒకరోజు సమయం కావాలని పిటిషనర్ లాయర్ ఎ.సత్యప్రసాద్ కోరారు. దీంతో బుధవారం విచారిస్తామని బెంచ్ ప్రకటించింది. గత నెల రెండో విడత కౌన్సెలింగ్ చేసేశారని, దీని వల్ల రిజర్వేషన్ల కేటగిరీ క్యాండెట్లు నష్టపోయారని పిటిషనర్ వాదించారు. ఫస్ట్ కౌన్సెలింగ్‌లో వివిధ కారణాల వల్ల భర్తీ కాని సీట్లను రెండో కౌన్సెలింగ్‌లో భర్తీ చేయాలని, వీటిని ముందుగా జనరల్ కోటా సీట్లు, ఆ తర్వాత రిజర్వేషన్ కోటా సీట్లను భర్తీ చేయాలని జీవో 550 చెబుతోందన్నారు. అయితే జీవో 114 ప్రకారం చేశారనే వాదనను వర్సిటీ సమర్ధించుకుంది. 'ఫస్ట్ కౌన్సెలింగ్‌కు చెందినంతవరకే సుప్రీంకోర్టు ఉత్తర్వులున్నాయి. రెండో కౌన్సెలింగ్‌కు ఎలాంటివీ లేవు. రెండో కౌన్సెలింగ్ కూడా జీవో 550 మేరకు జరిపితే రిజర్వేషన్లు 50 శాతానికి దాటిపోయే ప్రమాదం ఉందని, అది సుప్రీం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకం అని'' కాళోజి హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది. 'ఓపెన్ కోటా సీట్లను జనరల్ కేటగిరీలోని మెరిట్, రిజర్వేషన్ కేటగిరీలోని మెరిట్ ఉన్న వాళ్లలో భర్తీ చేశాం. అలా భర్తీ అయ్యాక రిజర్వేషన్ కేటగిరీ వాళ్లు ఓపెన్ సీటు వదులుకుని రిజర్వేషన్ కోటా సీటును ఎంచుకుంటే తద్వారా ఖాళీ అయ్యే ఓపెన్ కోటా సీటను తిరిగి ఓపెన్ కోటా ద్వారా భర్తీ చేస్తున్నాం. జీవో 114 మేరకు చేయడం చట్టబద్ధమే. ఈ నేపథ్యంలో స్టే ఎత్తేయాలి. రిట్ కొట్టేయాలి' అని వర్సిటీ రిజిస్ట్రార్ కౌంటర్ వ్యాజ్యంలో వివరించారు.