Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 71.41 శాతం పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. 120 పురపాలక సంస్థల్లో 74.73, 9 నగరపాలక సంస్థలలో 58.86 శాతం నమోదైనట్టు ఎన్ఈసీ తెలిపింది. మొత్తం 35,50,483 ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా పోచంపల్లి మున్సిపాలిటీలో 95.13 శాతం, అత్యల్పంగా నిజాంపేట కార్పొరేషన్లో 39.65 శాతం పోలింగ్ నమోదైంది. 49 మున్సిపాల్టీల్లో 80 శాతం, ఆపైన ఓటింగ్ నమోదు కాగా, ఔటర్ రింగ్‌రోడ్ పరిధిలో ఉన్న మూడింటిలో 50 శాతం కంటేతక్కువ నమోదైంది. ఇక తొమ్మిది కార్పొరేషన్లలో అత్యధికంగా రామగుండంలో 67.66 శాతం పోలింగ్ నమోదు కాగా బోడుప్పల్లో 64.67 శాతం, ఫీర్జాదిగూడలో 64.31 శాతం, బడంగ్పేట్ 63.87 శాతం, నిజామాబాద్‌లో 61.12 శాతం, బండ్లగూడ జాగీర్‌లో 56.06 శాతం, మీర్‌పేటలో 51.78 శాతం, జవహర్‌నగర్‌లో 50.02 శాతం, నిజాంపేటలో 39.65 శాతం నమోదైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఓటింగ్‌కు భిన్నంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఉత్సా హంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. తమ ప్రాంతాలలో మంత్రులు, ఎంఎల్ఎలు సైతం పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిహెఎంసి పరిధిలోని డబీర్‌పుర డివిజన్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు రిటర్నింగ్ అధికారి కె.అనిల్ కుమార్ తెలిపారు. మొత్తం 27.31 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తెలిపారు. మొత్తం 50,155 మంది ఓటర్లలో కేవలం 13,699 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
1.పోచంపల్లి - 95.13
2.చందూరు -91.33
3.యాదరిగిగుట్ట -90.69
4.చౌటుప్పల్ - 90.61
5.ఆదిభట్ల - 90.27
6.చిట్యాల - 89.75
7.మోత్కూరు - 89.66
8.రామాయంపేట - 88.97
9.తిరుమలగిరి - 88.77
10.వర్థన్నపేట్ - 88.63
11.హాలియా - 88.14
12.ఐజా - 87.06
13.ఆలేర్ - 86.69
14.వైరా - 86.46
15.హుజూర్ నగర్ - 86.39
16.భూత్పూర్ - 86.12
17.ఆమన్ గల్ - 85.76
18.ఆందోల్ -జోగిపేట - 84.26
19.నర్సంపేట్ - 84.25
20.వడ్డెపల్లి -84.24
21.హుస్నాబాద్ - 84.16
22.భువనగిరి - 84.03
23.సుల్తానాబాద్ -83.29
24.డోర్నకల్ - 83.20
25.దేవరకొండ - 83.10
26.తెల్లాపూర్ - 83.10
27.మరిపెడ - 82.88
28.తూప్రాన్ - 82.80
29.దుబ్బాక -82.57
30.మధిర -82.53
31.తుక్కుగూడ - 82.53
32.కోదాడ - 82.52
33.పెబ్బేర్ - 82.51
34.సూర్యాపేట - 82.50
35.హుజూరాబాద్ - 82.49
36.పరకాల - 81.90
37.చొప్పదండి - 81.82
38.సిరిసిల్ల - 81.78
39.చేర్యాల - 81.53
40.తుర్కయంజాల్ - 81.43
41.కొల్లాపూర్ - 81.37
42.సత్తుపల్లి - 81.10
43.కల్వకుర్తి -81.01
44.వేములవాడ - 80.69
45.అమరచింత - 80.69
46.గజ్వేల్ - 80.49
47.ఎల్లారెడ్డి - 80.35
48.మెదక్ - 80.26
49.అలంపూర్ - 80.02
50.మంథని - 79.82
51.కొత్తపల్లి -79.74
52.జనగామ - 79.36
53.మిర్యాలగూడ - 79.31
54.శంషాబాద్ - 79.13
55.నేరెడుచర్ల - 79.01
56.నర్సాపూర్ -78.94
57.జమ్మికుంట - 78.89
58.ఇబ్రహీంపట్నం - 78.84
59.షాద్ నగర్ - 78.45
60.సదాశివపేట - 78.27
61.మహబూబాబాద్ - 78.01
62.బెల్లంపల్లి - 78.00
63.కొత్తకోట - 77.96
64.లక్సెట్టిపేట - 77.95
65.నల్గొండ - 77.90
66.ఆత్మకూరు - 77.89
67.బాన్సువాడ -77.07
68.కొడంగల్ - 77.04
69.నాగర్ కర్నూల్ - 76.89
70.కొత్తగూడెం - 76.47
71.ధర్మపురి - 76.36
72.పెద్దపల్లి - 76.22
73.రాయికల్ - 76.02
74.చెన్నూరు - 75.80
75.ఖానాపూర్ - 75.79
76.కొస్గి -75.78
77.మహబూబ్ నగర్ - 75.68
78.నార్సింగి - 75.61
79.పెద్దఅంబర్ పేట్ - 75.34
80.నారాయణపేట్ - 74.93
81.మక్తల్ - 74.24
82.గద్వాల - 74.10
83.వికారాబాద్ - 74.00
84.శంకర్ పల్లి - 73.78
85.పరిగి - 73.63
86.కైతాన్ పల్లి - 73.02
87.వనపర్తి - 72.96
88.ఇల్లందు -72.91
89.నారాయణ్ ఖేడ్ - 72.78
90.తొర్రూరు - 72.55
91.తాండూరు - 72.49
92.ఆర్మూరు - 72.40
93.బోధన్ - 72.32
94.కోరుట్ల -72.30
95.సంగారెడ్డి - 72.13
96.జగిత్యాల - 72.02
97.తూంకుంట - 71.82
98.భీంగల్ - 71.80
99.గుండ్లపోచంపల్లి - 70.79
100.పోచారం - 70.59
101.ఘట్కేసర్ - 70.19
102.ఆదిలాబాద్ - 69.95
103.మెట్ పల్లి - 69.53
104.కాగజ్ నగర్ - 68.95
105.దుండిగల్ - 68.81
106.మేడ్చల్ - 67.90
107.రామగుండం - 67.66
108.కామారెడ్డి - 67.53
109.మంచిర్యాల - 67.14
110.బొల్లారం - 66.86
111.కొంపల్లి - 66.03
112.అమీన్ పూర్ - 65.30
113.నిర్మల్ - 65.28
114.భైంసా - 64.70
115.బోడుప్పల్ - 64.67
116.పీర్జాదీగూడ - 64.31
117.బడంగ్ పేట్ - 63.87
118.నందికొండ - 63.74
119.భూపాలపల్లి - 63.37
120.నాస్పూర్ - 62.05
121.నాగారం - 61.31
122.నిజామాబాద్ - 61.12
123.దమ్మాయిగూడ -61.04
124.బండ్లగూడ జాగీర్ - 56.06
125.మీర్ పేట్ - 51.78
126.జవహర్ నగర్ - 50.02
127.జల్ పల్లి - 46.91
128.మణికొండ -41.03
129.నిజాంపేట - 39.65