Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాట్టాంకులత్తూరు నిర్వహించిన నేచర్ ఇండెక్స్-2020 ర్యాంకుల్లో దేశంలోని ప్రయివేటు విశ్వవిద్యాల యాల్లో నెంబర్‌వన్ స్థానంలో ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిలిచింది. దేశంలోని విశ్వవిద్యాలయాల్లో 21వ ర్యాంకును పొందింది. ఈ ర్యాంకులను నేచర్ ఇండెక్స్ 2019, జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు తీసుకున్న డాటా ఆధారంగా చేపట్టారని తెలిపింది. నాలుగు విస్తారమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎస్ఆర్ఎంఐఎస్టీని కెమిస్ట్రీలో 19వ ర్యాంకు, ఫిజికల్ సైన్సెస్‌లో 28వ ర్యాంకును ప్రకటించింది. నేచర్ అండ్ సైన్స్ జర్నల్ గ్రూప్‌లో ఎస్ఆర్ఎంఐఎస్టీకి దేశంలోనే ఐదో స్థానాన్ని కేటాయించింది. అన్ని ప్రచురణలూ ఇప్పటి వరకు 22 వేలకు చేరుకున్నాయి. యూనివర్సిటీ హెచ్-ఇండెక్స్ స్కోపస్ ఆధారంగా 83కు చేరుకుంది. నేచర్ ఇండెక్స్ డాటాబేస్ అనుబంధ గుర్తింపులకు, సంస్థాపరమైన సంబంధాలకు సంధానకర్తగా ఉంటున్నది. ప్రత్యేకంగా పరిశోధనాత్మక వ్యాసాలను 82 ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన నేచురల్ సైన్స్ జర్నల్స్‌ను ప్రచురించింది. పరిశోధనాత్మక స్వతంత్ర గ్రూప్‌లను ఎంపిక చేసుకుంటుందని వర్సిటీ నిర్వాహకులు తెలిపారు.