Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు 5.8 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉత్తర- దక్షిణ ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని తెలిపింది. రేపు, ఎల్లుండి అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు చాలాచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వాన, కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.