Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెగిన ఎస్ఐ బొటన వేలు
నవతెలంగాణ-కొత్తపెల్లి
మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటనలో అపశృతి చోటుచేసు కుంది. నిరంజన్‌రెడ్డితో పాటు మంత్రి గంగుల కమలాకర్ ఎస్కార్ట్ వాహనాల్లో ఓ వాహనం బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న కొత్తపల్లి ఎస్ఐ ఎల్లయ్య గౌడ్‌కు ఎడమ చేతి బొటనవేలు తెగింది. స్థానికుల వివరాల ప్రకారం... కరీంనగర్ జిల్లా వెలిచాల గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన మంత్రి నిరంజన్ రెడ్డి గంగుల కమలాకర్‌లు తిరిగి రాగా నిరంజన్ రెడ్డి బైపాస్ మార్గం ద్వారా హైదరాబాద్‌కు పయనమయ్యారు. మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్‌కు వస్తున్న క్రమంలో ఎస్కార్ట్‌గా వస్తున్న కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ ఎస్కార్ట్ వాహనం ఆర్టీసీ వర్క్‌షాప్ దగ్గర డివైడర్‌ను ఢకొీని బోల్తా పడింది. వాహనంలో ఉన్న ఎస్ఐ ఎల్లాగౌడ్ చేతికి తీవ్ర గాయాలై బొటన వేలు తెగింది. కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.