Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వచ్చే మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. వాయువ్వ బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో 2.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తర ఇంటీరియల్ కర్నాటక, దాని పరిసర ప్రాంతాల్లో 3.6 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఫలితంగా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడి తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.