స్మార్ట్‌ఫోన్స్‌లో ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లు సూపర్ హిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. తాజాగా మన దేశంలో 'ఇండస్ ఓఎస్' స్మార్ట్‌ఫోన్స్ కోసం తయారైంది. ఇది వరల్డ్ ఫస్ట్ రీజనల్ మొబైల్ ఓఎస్. ఇక ఇండస్ ఆపరేటింగ్ విషయానికొస్తే.. ఇందులో తెలుగు, కన్నడ, తమిళం, మళయాళంతో పాటు హిందీ, పంజాబీ, ఒడియా, బెంగాలీ, అస్సామీ లాంటి భాషలూ సపోర్ట్ చేస్తాయి. ఆపరేటింగ్ సిస్టమ్ సింపుల్‌గా ఉండటంతో పాటు స్మార్ట్ యూజర్ ఫ్రెండ్లీగా ఇది పని చేస్తుంది. కేవలం ఒక స్వైప్‌తో కీబోర్డు ప్యాటరన్ను సులభంగా మార్చుకోవచ్చు. అంతేకాదు హిందీలోని వాక్యాలను ఇంగ్లీష్ లోకి అనువదించుకునే సదుపాయం కూడా ఉంది.
ఇందులో టైప్ చేసే సమయంలో మీరు రాయాలనుకున్న పదాల ప్రిడిక్టర్ కనిపిస్తుంది. దీంతో వేగంగా టైప్ చేయవచ్చు. దీంతో పాటు ఇండస్ ఓఎస్ కి ప్రత్యేకంగా ఆప్ బజార్ ఉంది. ఇందులో పాటలూ, వీడియోలు, గేమ్స్ ఉంటాయి. మాట్లాడితే చాలు ఆటోమాటిక్‌గా ఆ భాష తెరమీద కనిపిస్తుంది త్వరలో ఇంటెక్స్, సెల్కాన్, కార్బన్ మొబైల్స్‌లో ప్రీలోడెడ్‌గా అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోనే తొలి ప్రాంతీయ ఓఎస్ అయిన ఇండస్‌ను ఉపయోగించాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే!
Authorization