ఐఫోన్ వినియోగదారులందరూ ఎస్డీ కార్డుతో మెమొరీని పెంచుకునే వెసులుబాటు ఉంటే బాగుండేదని అనుకుంటారు. అలాంటి వారికి ఉపశమనం కలిగించే ప్రయత్నం చేసింది యాపిల్. ఐఫోన్ అంతర్గత మెమోరీని ఆదా చేసే ఫీచర్‌ను ఐఓఎస్ 10.3లో అందుబాటులోకి తెచ్చింది. ఐఓఎస్ తాజా వెర్షన్ '10.3'ను ఫోన్లో అప్డేట్ చేసుకుంటే కొన్ని జీబీల మెమోరీని ఆదా చేసుకునే వీలుంటుంది. అంటే.. ఇప్పటికే ఫోన్లో మెమోరీ పూర్తిగా నిండిపోయిందనుకుంటే.. ఓఎస్‌ను అప్డేట్ చేసిన తర్వాత కొన్ని జీబీల ఖాళీ చూపిస్తుంది. ఈ ఫీచర్ కోసం యాపిల్ కొత్త ఫైల్ సిస్టంను ప్రవేశపెట్టింది. మెమోరీ ఆదాతో పాటు ఫోన్ వేగం కూడా పెరుగుతోంది. ఐఫోన్ 5, ఐప్యాడ్ 2, ఐప్యాడ్ మిని 2, ఐప్యాడ్ ప్రొ, 6వ జెనరేషన్ ఐపాడ్ టచ్, ఆ తర్వాత వచ్చిన మోడల్ యాపిల్ గ్యాడ్జెట్లన్నింటిలో ఐఓఎస్ 10.3ని అప్డేట్ చేసుకోవచ్చు.