గూగుల్ తన కొత్త ఆప్‌ను విడుదల చేసింది. 'ఏరియో' పేరుతో విడుదల చేసిన ఈ ఆప్ ద్వారా దగ్గరల్లో ఉన్న హౌటళ్లు, రెస్టారెంట్ల వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాదు కావాల్సిన ఫుడ్‌ను ఆర్డర్ చేయవచ్చు. ప్లంబర్, బ్యుటీషియన్ వంటి సర్వీస్‌లను ఈ ఆప్ ద్వారా పొందవచ్చు. ఈ ఆప్‌లో ఫుడ్‌తో పాటు అనేక ఇతర సర్వీస్‌లు ఒకచోట ఉండటం వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది. ప్రస్తుతానికి ఈ ఆప్ ఢిల్లీ, బెంగళూరు నగరాలకు మాత్రమే పరిమిమైంది. త్వరలోనే హైదరాబాద్‌లోనూ వినియోగంలోకి రానుంది.