టెక్నాలజీ మనిషి జీవనాన్ని సులభతరం చేస్తోంది. మనుషులు చేయలేని ఎన్నో పనులను మరమనుషులు చేస్తున్నాయి. వైద్యం రంగంలో రాణిస్తున్న రోబోటిక్ టెక్నాలజీని ఇప్పుడు సైన్యంలోనూ ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం పరిశోధనల దశలో ఉన్న కృత్రిమ మేధస్సు రానున్నరోజుల్లో ప్రపంచగతిని శాసిస్తుందనీ వార్తలొస్తున్నాయి. రష్యాలోని ఓ రోబో చేసిన విన్యాసాలు చూస్తే ఇవన్నీ నిజమే అనిపిస్తుంది. ఎవరినైనా ఒకసారి చూస్తే గుర్తుపెట్టుకునే రోబో చేసిన ఓ పని ఇప్పుడు అందరినీ సంభ్రమాశ్చర్యాలకు లోనుచేస్తోంది.
రోబో అంటే ఎలక్ట్రానిక్ ప్రోగ్రామింగ్ ద్వారా పనిచేసే మరమనిషి. 1948లో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ రోబోట్‌ని ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌లో విలియం గ్రే వాల్టర్ రూపొందించారు. 1954లో జార్జి డెవోల్ మొదటి డిజిట్. ప్రోగ్రామబుల్ రోబోని తయారుచేసి, జనరల్ మోటార్స్ అనే కంపెనీకి 1960లో విక్రయించారు. ఆ కంపెనీ వారు వేడివేడి లోహాల ముక్కలను పైకి లేపటానికి వీటిని ఉపయోగించేవారు. రోబో అనే పేరు చెకొస్లవేకియా వారి భాషలోని రోబోటా అనే పదం నుంచి వచ్చింది. చెక్ భాషలో తప్పనిసరి కార్మికుడు అని అర్థం. ఈ రోబోలను అణుథార్మిక సంబంధిత పనులలోని సున్నితమైన దశల్లో ఉపయోగించేవారు. మనిషికి ప్రమాదం కలిగించే విభాగాల్లో పనిచేయటానికి ఈ రోబో ఉపయోగపడుతుందని భావించేవారు. ప్రస్తుతం అభివృద్ధ్ది చెందిన దేశాల్లో సాధారణ పనులకు కూడా రోబోలపై ఆధారపడుతున్నారు.
డ్యాన్స్‌తో గిన్నిస్ రికార్డు
రోబో సినిమా అందరికీ గుర్తుం టుంది. ఈ సినిమాలో రోబో అద్భుతమైన డాన్స్ చేస్తుంది. ఇప్పుడు అదే తరహాలో కొన్ని రోబోలు డ్యాన్స్ చేసి రికార్డు సృష్టిం చాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 1069 రోబో లు డ్యాన్స్ చేసి అదుర్స్ అనిపిం చాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదిం చాయి.
ఈ రోబో రికార్డ్ డ్యాన్స్‌కు చైనాలో గంగ్జూ వేదికగా మారింది. 1069 రోబోలు ఒకేసారి ఒకే విధంగా గ్రూప్ డ్యాన్స్ చేసి సరికొత్త వరల్డ్ రికార్డు సాధించాయి. డబ్ల్యూఎల్ ఇంటలీజెంట్ టెక్నాలజీ కంపెనీ తయారు చేసిన ఆ రోబోల పెరు డోబి. ఇక.. రోబో డ్యాన్స్ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ యూట్యూబ్ చానెల్ లో షేర్ చేసింది. కొద్ది నిమిషాల్లోనే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలయింది.
'వన్ గ్రూప్ కంట్రోల్ సిస్టమ్' ప్రోగ్రామ్ ఆధారంగా ఇవి ఏకకాలంలో డ్యాన్స్ చేశాయి. చిందులతో కదం తొక్కాయి. గతంలో చైనాలో జరిగిన బీర్ ఫెస్టివల్ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో 1007 రోబోలు బ్రేక్ డ్యాన్స్ చేసి గిన్నిస్ రికార్డు సృష్టించాయి. ఆ రికార్డును 'దోబి' రోబోలు ప్రస్తుతం బద్దలు కొట్టాయి. ఈ దోబి రోబోల ఎత్తు - 47.3 సెంటిమీటర్లు. ఇవి పాటలు పాడటంతో పాటు, ఫుట్‌బాల్ కూడా ఆడతాయి. కుంగ్‌ఫూ కూడా చేయడం విశేషం.
'రోబో' స్టెప్పుల రికార్డు
గతంలో చైనా కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా 540 రోబోలు ఒకే వేదికపై డ్యాన్సులు చేసి అలరించాయి. అంతేకాదు ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించిన టీవీ ప్రోగ్రామ్‌గా అది రికార్డులకెక్కింది. రోబోల డ్యాన్స్‌ను 26 డ్రోన్లు వీడియో తీశాయి. చైనా సెంట్రల్ టెలివిజన్(సీసీటీవీ) ఈ కార్య క్రమాన్ని ప్రసారం చేయగా 70 కోట్ల మంది వీక్షించటం విశేషం. ప్రపం చంలోనే అత్యధిక ప్రజలు చూసిన కార్యక్రమంగా రోబో డ్యాన్స్ నిలిచింది.
హలో పుతిన్..!
ఇటీవల పెర్మ్ లో జరుగుతున్న టెక్నాలజీ ఎగ్జిబిషన్ కు రష్యాన్ అధ్యక్షుడు పుతిన్ హాజరయ్యారు. అక్కడ ఒక స్టాళ్లను పరిశీలిస్తున్న పుతిన్ ను రోబో కలిసి 'హలో పుతిన్' అంటూ చేతులు కలుపుతూ తనను తాను పరిచయం చేసు కుంది. ఈ వీడియో నెట్ లో వైరల్ గా మారింది. ప్రొమోబోటోగా పిలువ బడే ఈ రోబోను రష్యాలో టూర్ గైడ్ గా, సేల్స్ ప్రమోటర్ గా, మోడల్ గా ఉపయోగిస్తున్నారు. రష్యాకు చెందిన కొందరు ప్రముఖుల ముఖాలను ఈ రోబో గుర్తించగలదు. ఆ క్రమంలోనే ప్రొమో బోట్ పుతిన్ ను గుర్తుపట్టింది. గత ఏడాది తయారీ ల్యాబ్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ రోబో కారణంగా రష్యాలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది.
హైదరాబాద్‌లో పోలీస్ రోబో
మాట్లాడ గలిగే, నడిచే మొట్టమొదటి దేశీయ పోలీస్ రోబో వచ్చేస్తోంది. ఇంకా ఈ రోబోలో ఎన్నో ప్రత్యేకతలుంటాయని హెచ్-బోట్స్ రోబోటిక్స్ ఫౌండర్, సీఈవో పీఎస్వీ క ష్ణన్ చెబుతున్నారు. తాము రూపొందించే పోలీస్ రోబో అన్ని సెక్యూరిటీ సర్వీసులను అందజేసేదిగా ఉంటుం దని, అది మాట్లాడగలదు.. నడవగలదు... వ్యక్తులను గుర్తు పట్టడంతో పాటు ఫిర్యాదులను స్వీకరిం చడం, బాంబులను నిర్వీర్యం చేస్తోందని అంటు న్నారు. వచ్చే నవంబరులో హైదరా బాద్ లో జరిగే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యుర్ షిప్ సమ్మిట్ ఈ రోబోను ప్రదర్శిస్తామని ఆయన చెప్పారు. ఇది ప్రపంచంలో రెండో హ్యూమ నాయిడ్ రోబో అవుతుంది. పైగా ఇండియాలో తయా రవుతున్న మొట్టమొదటి రోబో. గతంలో ఫ్రాన్స్ లో తయారైన రోబోను దుబారు లో ప్రదర్శించారు. అది చక్రాలపై ముందుకు కదిలితే ఈ రోబో చక్కగా కాళ్ళతో నడుస్తుంది. మూడు లక్షల ఖర్చుతో తాము రూపొందిస్తున్న ఈ ప్రోటో-టైప్ రోబో వచ్చే అక్టోబరులో సిద్ధమవుతుందన్నారు. ఇలాంటి ప్రైవేట్ పోలీస్ రోబోలను పదింటిని ప్రతి ఏడాదీ తయారు చేయనున్నారు.
ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ..!
మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కొత్తరకం రోబోను తయారుచేశారు. సామాజిక అవగాహన వ్యవస్థ (సోషల్ అవేర్నెస్ నావిగేషన్)తో కూడిన ఈ రోబో.. ఎంతటి రద్దీ ప్రాంతంలోనైనా ఎవరినీ ఢకొీట్టకుండా ముందుకు సాగిపోతుందట. అంతేకాదు ట్రాఫిక్ నియమాలను కూడా కచ్చితంగా పాటిస్తుందని చెబుతున్నారు. వాహనం నడిపే డ్రైవర్ ట్రాఫిక్ సిగల్స్‌ను ఎలా పరిశీలిస్తూ ముందుకు సాగుతాడో ఈ రోబో కూడా అచ్చంగా అలాగే పరిస్థితులను బట్టి ముందుకు సాగిపోతుందట.
బోస్టన్ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం.. రోడ్డుకు కుడివైపునే ప్రయాణించడం, ఎడమవైపు నుంచి ఓవర్టేక్ చేయడం, వాహనానికి, వాహనానికి మధ్య ఉండాల్సిన గ్యాప్‌ను కొనసా గించడం, ఎరుపు, ఆకుపచ్చ సిగల్స్ పడినప్పుడు ఆగడం, ముందుకు కదలడం వంటి నియమాలను కచ్చితంగా పాటిస్తుందని చెబుతున్నారు. పరిస్థితులను అంచనా వేసుకుంటూ నిర్ణయాలు తీసుకునే ఇటువంటి రోబోలతో భవిష్యత్తులో మరెన్నో ప్రయోజనాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
వేస్ట్ మేనేజ్మెంట్లో..
గ్లోబల్ ప్రమాదకర పర్యావరణ వ్యర్థ పదార్థాల నిర్వహణలో రోబోట్లు మార్కెట్ 2017-2021 కాలంలో 16.64 శాతం పెరగనుందని ఒక అంచనా. మార్కెట్లో ప్రస్తుతం ఉపయోగిస్తున్న తరహాలోనే రానున్న కాలంలో ఉపయోగించే రోబోట్లును ఎక్కువగా ప్రమాదకర పర్యావరణ వ్యర్థాల నిర్వహణలో ఉపయోగిస్తారు. ఇందుకు అనుగుణంగా రోబోటిక్స్ టెక్నాలజీలో చాలా మార్పులు వస్తున్నాయి. వేస్ట్ లోడ్, వ్యర్థాల విభజన, భవనం కూల్చివేత, టన్నెలింగ్, మైనింగ్ తదితర పనుల్లో రోబోట్లను ఉపయోగించనున్నారు. హానికర వాతావరణంలో, అణ్వస్త్ర తయారీలో, పెట్రోకెమికల్ ప్లాంట్లలోనూ వీటిని ఏర్పాటుచేస్తారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, చైనా అనేక ఇతర దేశాలలో వ్యర్థ పదార్థాల నిర్వహణలో రోబోట్లను ఉపయోగించే ప్రక్రియ రూపొందిస్తున్నారు.
-వి.ఎస్ ఆదిత్య